వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న వారిలో నటుడు సంపత్ రాజ్ ఒకరు. ప్రభాస్ మిర్చి సినిమాతో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సంపత్ రాజ్. మిర్చి సినిమాతర్వాత ఆయన వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. విలన్ గానూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ నటిస్తూ అలరిస్తున్నారు సంపత్ . కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. శ్రీమంతుడు, మిర్చి సినిమాల గురించి, అలాగే మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో తన అనుభవాలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శ్రీమంతుడు చిత్రంలో తన పాత్రకు కొరటాల శివ గారు పిలిచిన విధానం, మహేష్ బాబుతో పనిచేసిన అనుభవం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కొరటాల శివ కథను వివరించి, సంపత్ రాజ్ ఖచ్చితంగా చేయాలని కోరారని, ఒక రచయితగా కొరటాల కథపై తనకు నమ్మకాన్ని కలిగించారని తెలిపాడు సంపత్. ఆ సినిమా తనకు పెద్ద ఇంపాక్ట్‌ను ఇచ్చిందని తెలిపాడు.
ఇదికూడా చదవండి :ఏంటి సుధా ఈవిడ..! మరీ ఇంత హాట్‌గా ఉందేంటి గురూ.!! హీరోయిన్స్ కూడా పనికిరారు
మహేష్ బాబు నటనా శైలి గురించి మాట్లాడుతూ.. ఆయన ఒక సహజ నటుడని సంపత్ రాజ్ పేర్కొన్నారు. మనం ఎలా మాట్లాడుకుంటామో, అలాగే షాట్‌లో చేస్తారు. రియాలిటీలో మనం ఎగ్జాజరేటెడ్ ఎక్స్ప్రెషన్స్‌తో మాట్లాడము కదా, మహేష్ బాబు ది అలాగే ఉంటది, ఇద్దరు మంది మాట్లాడుకుంటే ఎలా ఉంటదో అలా ఉంటది. అది స్క్రీన్ మీద పెద్ద ఇంపాక్ట్‌ను ఇస్తుంది” అని వివరించారు. మహేష్ బాబు ఆరా, లుక్స్, పర్సనాలిటీ కూడా నటనకు అదనంగా తోడ్పడతాయని అన్నారు. మిర్చి సినిమా గురించి ప్రస్తావిస్తూ, అది తెలుగు రాష్ట్రాలలో ఎంతటి ప్రభావాన్ని సృష్టించిందో, అందులో విలన్‌గా తాను కూడా అంతే పాపులారిటీని పొందానని తెలిపాడు.
ఇదికూడా చదవండి :అప్పుడు క్యూట్‌గా ఉండేది కదరా.. ఇలా మారిపోయిందేంటీ..!! బికినీ ఫొటోలతో రచ్చ చేస్తున్న మిరపకాయ్ భామ
కొరటాల శివ దర్శకుడిగా మారిన మొదటి చిత్రం మిర్చి అని, అలాంటి సమయంలో ఆయనే తన తమిళ్ సినిమాలు చూసి, కథ చెప్పి, క్లైమాక్స్ డైలాగ్‌ను వివరించారని సంపత్ రాజ్ వెల్లడించారు. ఇక ప్రభాస్‌తో మిర్చి షూటింగ్ జర్నీ చాలా అద్భుతంగా ఉండేదని సంపత్ రాజ్ తెలిపారు. ప్రభాస్ ఇంటి నుంచి అన్నీ వంటలు, చేపల నుంచి మటన్, చికెన్ వరకు తెప్పించేవారని, చాలా ఫ్రాండ్లీగా ఉండేవారని తెలిపారు. తాను అప్పట్లో 98 కేజీల బరువు ఉండేవాడినని, అయినా కూడా ప్రభాస్ తనను మరింత తినమని బలవంతం చేసేవారని సరదాగా గుర్తుచేసుకున్నాడు సంపత్ రాజ్.
ఇవి కూడా చదవండి
ఇదికూడా చదవండి :ఈ సినిమా ఉంటది భయ్యా..! చూస్తే ప్యాంట్ తడిసిపోవాల్సిదే.. ఇద్దరు స్టార్ హీరోలు ఇరగదీశారు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.