మెటా యాజమాన్యంలోని వాట్సాప్, తన వెబ్ వినియోగదారుల కోసం ఒక విప్లవాత్మకమైన అప్‌డేట్‌ను ప్రకటించింది. ఇకపై కంప్యూటర్లలో ప్రత్యేకంగా యాప్‌ను డౌన్‌లోడ్ చేయనవసరం లేకుండానే, నేరుగా బ్రౌజర్ నుండే ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్షన్‌లో మాత్రమే కాలింగ్ సౌకర్యం ఉండేది. కానీ ఫిబ్రవరి 10న వచ్చిన తాజా అప్‌డేట్‌తో గూగుల్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ వంటి బ్రౌజర్ల ద్వారా నేరుగా కాల్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ‘వాట్సాప్ వెబ్ బీటా’ ప్రోగ్రామ్‌లో ఉన్న ఎంపిక చేసిన వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. రాబోయే కొద్ది వారాల్లో సాధారణ యూజర్లందరికీ ఇది దశలవారీగా అందుబాటులోకి రానుంది. ఇందులో.. వీడియో కాల్ సమయంలో మీ కంప్యూటర్ స్క్రీన్‌ను ఇతరులకు షేర్ చేయవచ్చు. ఇది ఆఫీస్ మీటింగ్స్, ప్రజెంటేషన్లకు ఎంతో ప్రయోజనకరం. మొబైల్ కాల్స్ లాగే ఇవి కూడా ‘ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్’తో పూర్తి సురక్షితంగా ఉంటాయి. ప్రస్తుతం వ్యక్తిగత కాల్స్ కు మాత్రమే అవకాశం ఉండగా, త్వరలోనే 32 మంది వరకు గ్రూప్ కాల్‌లో మాట్లాడుకునేలా, కాల్ లింక్స్ మరియు షెడ్యూల్డ్ కాల్స్ వంటి ఫీచర్లను జత చేయనున్నారు. ఈ కొత్త ఫీచర్ ముఖ్యంగా లైనక్స్ వినియోగదారులకు మరియు అదనపు సాఫ్ట్‌వేర్లను ఇన్‌స్టాల్ చేయడానికి ఇష్టపడని వారికి గొప్ప ఊరటనిస్తుందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే.. ఏం చేశారంటే
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగుతున్నారా.. జాగ్రత్త
కష్టపడి రాళ్లతో పగలగొట్టాడు.. అంతలోనే..
రాత్రి తలుపు తట్టిన శబ్దం.. వణికిపోతున్న ఊళ్లు.. ఎందుకిలా
బంగారం కొంటున్నారా.. ? మీ కొంప కొల్లేరే