Viral Video: ఎక్కడ నుంచి వచ్చార్రా మీరంతా.. నిమిషాల్లోనే కోట్లకు కోట్లు దోచేశారు.. ఇదిగో వీడియో

Viral Video: ఎక్కడ నుంచి వచ్చార్రా మీరంతా.. నిమిషాల్లోనే కోట్లకు కోట్లు దోచేశారు.. ఇదిగో వీడియో


ఇటలీలో నడిరోడ్డు మీద దోపిడీ దొంగలు చెలరేగిపోయారు. అందరూ చూస్తుండగానే కోట్ల విలువైన యూరోలను తీసుకెళ్తున్న క్యాష్‌ వ్యాన్‌ను లూటీ చేశారు. సినీ ఫక్కీలో .. హాలీవుడ్‌ సినిమా సీన్‌ను తలపించే రీతిలో ఈ దోపిడీ జరిగింది. వ్యాన్‌ వెనుక భాగంలో మిలటరీ ఉపయోగించే పేలుడు పదార్ధాలను ఉపయోగించి దోపిడీ చేశారు. అంతేకాకుండా డ్రైవర్‌ను సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించారు.

దోపిడీ వెనుక ఇంటర్నేషన్‌ గ్యాంగ్‌ హస్తమున్నట్టు అనుమానిస్తున్నారు. పగటి వేళ హైవేపై ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. వ్యాన్ వెనుక భాగంలో మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలను పేల్చుతూ డ్రైవర్‌, సిబ్బందిని బెదిరించిన దుండగులు.. పక్కా ప్లాన్ ప్రకారం దోపిడీకి పాల్పడ్డారు. కేవలం కొన్ని నిమిషాల్లోనే కోట్లాది యూరోల నగదును చోరీ చేసినట్లు ప్రాథమిక సమాచారం.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారీ పేలుళ్లు, దుండగుల దాడి, రోడ్డుపై నిలిచిపోయిన వాహనాలు ఇవన్నీ కలసి ఓ యాక్షన్ థ్రిల్లర్ సీన్‌లా కనిపిస్తున్నాయి. చోరీ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. దుండగుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఇది అంతర్జాతీయ ముఠా పనిగా అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఇటలీ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

వీడియో చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *