IND vs PAK: 20 ఏళ్ల తర్వాత భారత్, పాక్ టెస్ట్ సిరీస్.. వేదిక ఎక్కడో తెలుసా..?

IND vs PAK: 20 ఏళ్ల తర్వాత భారత్, పాక్ టెస్ట్ సిరీస్.. వేదిక ఎక్కడో తెలుసా..?


Ind vs Pak T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్‌లో నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెర పడింది. దీంతో ఫిబ్రవరి 15న ఈ రెండు జట్లు పోటీ పడనున్నాయి. ఐసీసీ వార్నింగ్ తో పీసీబీ దిగొచ్చింది. ఈ క్రమంలో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తొలి టెస్ట్ సిరీస్‌లో పాల్గొనాలనే ప్రతిపాదన రెండు జట్లకు అందింది. మార్క్యూ ఈవెంట్‌లో భారత్‌తో ఆడకూడదని పట్టుదలతో ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వం.. ఫిబ్రవరి 15న తన చిరకాల ప్రత్యర్థులతో జరగనున్న మ్యాచ్‌కు అనుమతి ఇవ్వడంతో యూ-టర్న్ తీసుకుంది.

ఇప్పుడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాఘన్ ఇరు జట్లు ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ క్రికెట్ ఆడాలని ప్రతిపాదన చేశాడు. దీంతో ప్రపంచం మొత్తం చూడాలనుకునే ఈ పోరుకు ఇంగ్లాండ్ వేదిక కావాలని అతను కోరుకుంటున్నట్లు హిందూస్తాన్ టైమ్స్‌ పేర్కొంది. భారత్, పాక్ ప్రతిష్టంభన ముగిసిన కొన్ని గంటల తర్వాత మైఖేల్ వాఘన్ ఈ సూచన చేశాడు. ఈ సిరీస్‌కు యూకే సరైన ఆతిథ్యం ఇవ్వగలదని ఆయన విశ్వసిస్తున్నాడు.

రెండు దేశాలు టెస్ట్ సిరీస్‌లో తలపడేందుకు సిద్ధమైతే క్రికెట్‌కు గొప్పగా ఉంటుందని Xలో వాఘన్ పోస్ట్ చేశాడు. ‘ఇది పోటీకి, క్రికెట్‌కు చాలా బాగుంటుంది. ఈ రెండు జట్లు త్వరలో టెస్ట్ సిరీస్ కూడా ఆడాలి. 3 మ్యాచ్‌ల సిరీస్‌ను నిర్వహించడానికి UK గొప్ప ప్రదేశం అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

IND-PAK చివరిగా ఎప్పుడు టెస్ట్ సిరీస్ ఆడాయి..?

రెండు దేశాల మధ్య రాజకీయ సంక్షోభం కారణంగా, గత 19 సంవత్సరాలుగా భారత్, పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ జరగలేదు. రెండు జట్ల మధ్య చివరి సిరీస్ 2007లో జరిగింది. ఆ సమయంలో పాకిస్తాన్ వన్డే, టెస్ట్ సిరీస్ కోసం భారతదేశంలో పర్యటించింది.

ఆసక్తికరంగా, పాకిస్తాన్ వన్డేలను 2-3తో, టెస్ట్ సిరీస్‌ను 0-1తో కోల్పోయింది. అంతకుముందు 2004లో పాకిస్తాన్‌ను భారత జట్టు సందర్శించింది. 1989 తర్వాత మొదటిసారి, పూర్తి స్థాయి పర్యటన కోసం వెళ్లింది. అక్కడ వన్డేతోపాటు టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది. భారత జట్టు 2006లో మళ్ళీ పాకిస్తాన్‌లో పర్యటించింది. కానీ టెస్ట్ సిరీస్‌ను 0-1తో కోల్పోయింది.

మాజీ ఇంగ్లాండ్ ఆటగాడు చేసిన ప్రతిపాదన వినడానికి అద్భుతంగా అనిపించినప్పటికీ, రెండు దేశాల మధ్య రాజకీయ అవాంతరాల కారణంగా ద్వైపాక్షిక క్రికెట్‌లో రెండు దేశాలు కలిసే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *