Telangana: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. బుధవారం విద్యా సంస్థలకు సెలవు..

Telangana: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. బుధవారం విద్యా సంస్థలకు సెలవు..


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. అధికారులంతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భారీ భద్రత మధ్య బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుంది. ఓటింగ్ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో.. పోలింగ్ రోజున ఆయా కార్పోరేషన్, మున్సిపల్ పరిమితుల్లో సెలవు ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఫిబ్రవరి 11న రాష్ట్రవ్యాప్తంగా 116 మునిసిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు పోలింగ్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో.. సెలవు ప్రకటించారు.. దీంతో యా కార్పోరేషన్, మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ముసి వేయనున్నారు.

ప్రజాస్వామ్య ప్రక్రియలో.. ఎక్కువ ఓటింగ్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, పౌరులందరికీ.. ఓటింగ్ అందుబాటులో ఉంచడం.. ఈ సెలవుదినాన్ని ప్రకటించడం వెనుక ఉన్న ప్రాథమిక లక్ష్యం అని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.

సెలవు ఎవరెవరికంటే..?

పోలింగ్ ప్రాంతాలలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, సహకార సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ సెలవు వర్తిస్తుంది. పరిపాలనా వ్యవస్థ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించడానికి పూర్తిగా మద్దతు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు..

అనేక విద్యాసంస్థలు పోలింగ్ కేంద్రాలుగా ఉపయోగించబడుతున్నందున, ఫిబ్రవరి 11న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అలాగే కళాశాలలు రెండూ మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ భవనాలను ముందుగానే స్వాధీనం చేసుకుని ఓటింగ్ ప్రక్రియకు అవసరమైన అన్ని సన్నాహాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఎన్నికలు జరగనున్న మున్సిపల్, కార్పోరేషన్ పరిధిలో సెలవు అమలు కానుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *