కావాల్సిన పదార్ధాలు : అర కిలో కాకరకాయలు, అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు, ధనియాల పొడి అర టేబుల్ స్పూన్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ కారం, వెల్లుల్లి, నూనె , రుచికి పడినంత ఉప్పు, కరివేపాకు.
ముందుగా కాకరకాయలు తీసుకుని బాగా కడిగి ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకోండి. చేదు పోవడానికి ఉప్పులో ముక్కలను బాగా కడగండి. ఆ తర్వాత దానిలో పసుపు, ఉప్పు వేసుకుని 20 నిమిషాల పాటు ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టండి.
ఇలా చేస్తే కాకరకాయల్లో ఉండే చేదు మొత్తం పోతుంది. ఇంకా ఆ తర్వాత వీటిని వేయించడానికి కూడా సులభంగా ఉంటుంది. ఇక ఇప్పుడు వెల్లులి కారం కోసం ధనియాలు వేయించి మెత్తగా పొడి పట్టుకోవాలి.
ఆ తర్వాత వెల్లుల్లి పాయలు కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక కాకరకాయ ముక్కలు తీసుకుని నీరు లేకుండా పిండి ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో నూనె వేసి అది వేడయ్యాక కాకరకాయ ముక్కలను వేసుకుని బాగా వేయించాలి. గరిటేతో వాటిని తిప్పుతూ ఉండాలి. ముక్కలు రంగు మారిన తర్వాత కిందకు దించేయండి. కాకరకాయ ముక్కలు మగ్గిన తర్వాత వెల్లుల్లి కారం, రుచికి సరిపడేంత ఉప్పు, కరివేపాకు వేసి ఐదు నిమిషాలు పాటు అలా ఉంచి కిందకు దించేయండి. అంతే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ.




