Telangana: నీచుడా.. అన్నకు పిల్లనిచ్చారని ఎంత పని చేశావ్‌రా.. అత్తమామ నిద్రపోయాక అర్థరాత్రి..

Telangana: నీచుడా.. అన్నకు పిల్లనిచ్చారని ఎంత పని చేశావ్‌రా.. అత్తమామ నిద్రపోయాక అర్థరాత్రి..


Telangana: నీచుడా.. అన్నకు పిల్లనిచ్చారని ఎంత పని చేశావ్‌రా.. అత్తమామ నిద్రపోయాక అర్థరాత్రి..

ఆస్తికోసం కక్కుర్తి పడ్డ ఓ వ్యక్తి తన అన్నకు పిల్లనిచ్చిన అత్తమామలకు కరెంట్ షాక్ పెట్టి హతమార్చాలని ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో అత్త అక్కడికక్కడే విద్యుత్ షాక్ తో మృతిచెందగా, మామ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు.. ఆ ఉన్మాదిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన భార్య, బంధువులపై కూడా దాడికి పాల్పడ్డాడు. వారు కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేట శివారు మంగలితండాలో జరిగింది. బానోతు రమేష్ అనేవ్యక్తికి మూడురోజుల క్రితం రెండో వివాహం జరిగింది. మొదటి భార్యతో విడాకులు అవ్వడంతో రెండో వివాహం చేసుకున్నాడు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు గ్రామానికి చెందిన అజ్మీర రాందాస్ – కౌసల్య దంపతుల కుమార్తె అంజలిని రమేష్ రెండో వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులందరి సమక్షంలోనే వివాహం జరిగింది. పెళ్లి అనంతరం వధువు తల్లిదండ్రులు బంధుమిత్రులు రాజేష్ ఇంటికి వచ్చారు.

ఈ క్రమంలోనే సోమవారం రాత్రి తన అన్నకు పిల్లనిచ్చిన అత్తమామలు రమేష్ ఇంటికి వచ్చారు. అయితే తన అన్న రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని రాజేష్ కక్ష పెంచుకున్నాడు. పిల్లనిచ్చిన వారితో గొడవపడ్డాడు.

ఇరుగుపొరుగు వారు, కుటుంబ సభ్యులు అంతా నచ్చజెప్పడంతో నిన్నరాత్రి గొడవ సద్దుమణిగింది. అంతా పడుకున్నారు. ఈ క్రమంలో అర్థరాత్రి మానవ మృగంలా ప్రవర్తించిన రాజేష్ పక్కాప్లాన్ తో మర్డర్ స్కెచ్ వేశాడు. తన అన్నకు పిల్లనిచ్చిన అత్తమామలను విద్యుత్ షాక్ తో హతమార్చాలని ప్లాన్ చేశాడు.. వాళ్లంతా పడుకున్న తర్వాత అత్త మామలకు విద్యుత్ షాక్ పెట్టాడు.

మొదట మామ అజ్మీర రాందాస్ కు విద్యుత్ షాక్ పెట్టాడు.. అతను చనిపోయాడని భావించి ఆ తర్వాత అత్త కౌసల్యకు విద్యుత్ షాక్ పెట్టాడు.. ఈ క్రమంలో అత్త కౌసల్య అక్కడికక్కడే విద్యుత్ షాక్ తో మృతిచెందింది. మామ కొన ఊపిరితో కొట్టుమిట్టతుండగా కుటుంబసభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తన భార్యపై కత్తితో దాడిచేశాడు. తన అన్న భార్య అంజలిపై కూడా దాడికి పాల్పడ్డాడు.. దీంతో వారంతా తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సొంతఅన్నకు పిల్లనిచ్చిన అత్తమామలకు విద్యుత్ శాఖ పెట్టి హతమార్చడం కలకలం రేపింది.. మృతిచెందిన కంసాలి డెడ్ బాడీని మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. గాయాల పాలైనవారు మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు..

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు రాజేష్ పరారీలో ఉన్నట్టుగా సమాచారం.. ఆస్తి కోసమే రాజేష్ ఈ దారుణానికి ఒడికట్టాడని బంధువులు పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *