Actor: ఒకప్పుడు Gpayలో రూ.500 అడిగిన కుర్రాడు.. ఇప్పుడు 100 కోట్ల సినిమాకు డైరెక్టర్.. హీరోగానూ బ్లాక్ బస్టర్

Actor: ఒకప్పుడు Gpayలో రూ.500 అడిగిన కుర్రాడు.. ఇప్పుడు 100 కోట్ల సినిమాకు డైరెక్టర్.. హీరోగానూ బ్లాక్ బస్టర్


సినీరంగుల ప్రపంచం అంటే కనిపించినంత అందంగా ఉండదు. వెండితెరపై తమ నటనతో కోట్లాది మంది అలరించే తారల జీవితాల్లో ఎన్నో చీకటి కోణాలు ఉంటాయి. అలాగే డైరెక్టర్స్ సైతం ఎన్నో కష్టాలు దాటుకుని తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గురించి తెలుసుకుందామా. ఒకప్పుడు తన స్నేహితుడిని రూ.500 అడిగిన ఒక డైరెక్టర్.. ఆ తర్వాత తాను తెరకెక్కించిన సినిమా రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దర్శకుడిగా హిట్టు అందుకున్న ఆయన.. ఇప్పుడు హీరోగానూ సక్సెస్ అయ్యాడు. ఇంతకీ అతడు ఎవరో మీకు తెలుసా..? అతడి పేరు అభిషన్ జీవింద్. శ్రీలంక తీరంలోని తమిళులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని తన మొదటి సినిమాలో చూపించి సక్సెస్ అయ్యాడు. అతడి వయసు 24 సంవత్సరాలు. ఎవరీ దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేయలేదు. కానీ నేరుగా సినీరంగంలోకి అడుగుపెట్టి హిట్టు కొట్టాడు.

ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..

డైరెక్టర్ అభిషన్ జీవింద్ తెరకెక్కించిన సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ. ఇందులో శశికుమార్, సిమ్రాన్, యోగి బాబు, రమేష్ తిలక్, ఎం.ఎస్. భాస్కర్, ఇళంగో కుమారవేల్ వంటి తారలు కీలకపాత్రలు పోషించారు. గతేడాది ఏప్రిల్ 29న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. రూ.7 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ డిజిటల్, శాటిలైట్ హక్కులు కలిపి మొత్తం రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. మొదటి సినిమాతోనే తనదైన ముద్ర వేసిన అభిషన్ జీవింద్, తరువాత రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ నిర్మించిన ‘విత్ లవ్’ చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేశారు. ఇందులో మలయాళీ కుట్టి అనస్వర రాజన్ కథానాయికగా నటించింది. ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.11 కోట్లు వసూలు చేసింది.

ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.

ఈ క్రమంలోనే తాజాగా అభిషన్ జీవింద్ కు తన స్నేహితులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రూ.500 నుంచి ప్రారంభించి.. మూడు రోజుల్లోనే రూ.11 కోట్ల కలెక్షన్ రాబట్టడా అని అన్నారు. ప్రస్తుతం అభిషన్ జీవింద్ దర్శకుడిగానే కాకుండా హీరోగానూ సక్సెస్ అయ్యాడు.

ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

Abishan Jeevinth News

Abishan Jeevinth News

ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *