రెండు కోట్లు ఎక్కువైనా పర్లేదు శ్రీకాంత్‌ను తీసేయండి అన్నారు.. కట్ చేస్తే టాలీవుడ్ లోనే తిరుగులేని సినిమాగా నిలిచింది

రెండు కోట్లు ఎక్కువైనా పర్లేదు శ్రీకాంత్‌ను తీసేయండి అన్నారు.. కట్ చేస్తే టాలీవుడ్ లోనే తిరుగులేని సినిమాగా నిలిచింది


టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోలలో శ్రీకాంత్ ఒకరు. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 125 చిత్రాల్లో నటించి మెప్పించారు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన శ్రీకాంత్..ఆ తర్వాత విలన్ గా అలరించారు. వన్ బై టు సినిమాతో హీరోగా మారిన శ్రీకాంత్.. ఆ తర్వాత తాజ్ మహల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన నటనతో కట్టిపడేశారు. అప్పట్లో స్టార్ హీరోగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన శ్రీకాంత్.. ఇప్పుడు యంగ్ హీరోల సినిమాల్లో సహయ నటుడిగా అలరిస్తున్నారు.

గతంలో ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. రూ. 2 కోట్లు ఎక్కువైనా పర్లేదు శ్రీకాంత్ ను సినిమా నుంచి తీసేయమని ఓ నిర్మాత దర్శకుడికి చెప్పారని తెలిపారు. ఇంతకూ అసలు ఏం జరిగిందంటే.. ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్, తన సినీ కెరీర్‌లోని కీలకమైన ఖడ్గం సినిమా ఆఫర్ వెనుక ఉన్న ఆసక్తికర సంఘటనలను పంచుకున్నారు. . కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రవితేజ, ప్రకాష్ రాజ్ లతో పాటు శ్రీకాంత్ ప్రధాన పాత్ర పోషించారు. అయితే, శ్రీకాంత్ ను ఈ చిత్రానికి ఎంపిక చేయడంలో నిర్మాత నుండి ఊహించని అభ్యంతరం ఎదురైందని ఆయన తెలిపారు.

నిర్మాత శ్రీకాంత్ ను ఆడియన్స్ ఇప్పటివరకూ ఫ్యామిలీ ఓరియెంటెడ్ హీరోగా మాత్రమే చూశారు. ఎమోషనల్ రోల్, పైగా సీరియస్ పాత్రలను శ్రీకాంత్ సమర్థవంతంగా పోషించలేరని, అటువంటి పాత్రలకు ఆయన సరిపోరని నిర్మాత అభ్యంతరం వ్యక్తం చేశారట. శ్రీకాంత్ కు బదులు వేరే హీరోని తీసుకుంటే, సినిమాకు అదనంగా రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని నిర్మాత చెప్పారట.

ఇవి కూడా చదవండి

అయితే, దర్శకుడు కృష్ణ వంశీ శ్రీకాంత్ నటన నాకు నమ్మకం ఉందని చెప్పారట.. తాను పాత బస్తీ సినిమా చేసేటప్పుడు శ్రీకాంత్ నటనను, ముఖ్యంగా ఆయన భావోద్వేగాలను పలికించే తీరును ప్రత్యక్షంగా చూశానని కృష్ణవంశీ అన్నారట.. ఖడ్గంలో ఆ పాత్రకు శ్రీకాంత్ ఖచ్చితంగా న్యాయం చేస్తారు అని కృష్ణవంశీ గట్టిగా నమ్మారు. ఈ విషయంపై నిర్మాత అంగీకరించకపోతే, నిర్మాతను మార్చేసి శ్రీకాంత్ తోనే సినిమా చేస్తా అని కృష్ణవంశీ చెప్పారని శ్రీకాంత్ గుర్తు చేసుకున్నారు. కృష్ణ వంశీ పట్టుదల , అతని నటన పై ఆయనకున్న నమ్మకం వల్లే ఈ పాత్ర శ్రీకాంత్ కు దక్కిందని శ్రీకాంత్ తెలిపారు. ఇక ఖడ్గం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *