Hyderabad: ఎంతకు తెగించార్రా.. టెన్త్ స్టూండెట్‌ను ట్రాప్ చేసిన ఫిజిక్స్ టీచర్.. పేరెంట్స్‌కు తెలియకుండా..

Hyderabad: ఎంతకు తెగించార్రా.. టెన్త్ స్టూండెట్‌ను ట్రాప్ చేసిన ఫిజిక్స్ టీచర్.. పేరెంట్స్‌కు తెలియకుండా..


Hyderabad: ఎంతకు తెగించార్రా.. టెన్త్ స్టూండెట్‌ను ట్రాప్ చేసిన ఫిజిక్స్ టీచర్.. పేరెంట్స్‌కు తెలియకుండా..

పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ టీచర్ మాయమాటలు చెప్పి ఓ టెన్త్‌ క్లాస్ విద్యార్థిని రహస్యంగా పెళ్లి చేసుకున్న ఘటన మేడ్చల్‌ జిల్లా పోచారం పీఎస్‌ పరిధిలో వెలుగు చూసింది. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన టీచర్ పిల్లల జీవితాలతో ఆడుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుతు తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం పీఎస్ పరిధిలో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్‌లో ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి అదే స్కూల్‌లో టెన్త్ క్లాస్ చదువుతున్న ఓ విద్యార్థినిపై కన్నేశాడు. విద్యార్థినికి మాయమాటలు చెప్పి, ప్రేమ పేరుతో ఆమెను ట్రాప్ చేశాడు. కొన్నాళ్ల తర్వాత ఎవరికీ తెలియకుండా బాలికను బయటకు తీసుకెళ్లి పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే ఇటీవల బాలిక మెడతో పుసుపు తాడును గమనించిన తల్లి ఇదేంటని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తల్లి గట్టిగా బాలికను నిలదీయడంతో జరిగిన విషయాన్ని మొత్తం బాలిక తల్లితో చెప్పేసింది.

దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన బాలిక తల్లిదండ్రులు వెంటనే స్కూల్‌కు చేరుకొని ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ఇదేంటని స్కూల్ నిర్వాహకులను నిలదీశారు. అయితే స్కూల్‌ యాజమాన్యం సైతం నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పడంతో బాధిత తల్లిదండ్రులు నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదురు టీచర్‌ను అదుపులోకి తీసుకొని అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *