RRB Railway Exam 2026: రేపట్నుంచి ఆర్‌ఆర్‌బీ రైల్వే ఆన్‌లైన్‌ పరీక్షలు.. ఉచిత మాక్‌ టెస్ట్‌ల లింక్‌ ఇదిగో!

RRB Railway Exam 2026: రేపట్నుంచి ఆర్‌ఆర్‌బీ రైల్వే ఆన్‌లైన్‌ పరీక్షలు.. ఉచిత మాక్‌ టెస్ట్‌ల లింక్‌ ఇదిగో!


హైదరాబాద్‌, ఫిబ్రవరి 10: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో ఆర్‌ఆర్‌బీ సెక్షన్‌ కంట్రోలర్‌ పరీక్ష రేపట్నుంచి ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించి మాక్‌ టెస్టులను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఈ కింది డైరెక్ట్‌ లింక్‌ ద్వారా ఉచిత మాక్ టెస్ట్‌లు రాయవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఎలాంటి పాస్‌వర్డ్‌ లేకుండా ఈ ఉచిత మాక్‌ టెస్టును ఉపయోగించుకోవచ్చు. ఇక ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో ఆర్‌ఆర్‌బీ సెక్షన్‌ కంట్రోలర్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు అడ్మిట్‌ కార్డులను సైతం ఇప్పటికే బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

కాగా భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB)దేశ వ్యాప్తంగా గల అన్ని రైల్వే జోన్లలో మొత్తం 368 పోస్టులతో సెక్షన్‌ కంట్రోలర్‌ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టింది. డిగ్రీతో ఈ నియామకాలను భర్తీ చేయనుంది.

ఆర్‌ఆర్‌బీ సెక్షన్‌ కంట్రోలర్‌ ఉచిత మాక్‌ టెస్టుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

సీయూఈటీ యూజీ పరీక్ష తేదీలు ఇవే..

కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ యూజీ 2026) పరీక్షకు సంబంధించి దరఖాస్తుల సవరణకు ఫిబ్రవరి 11 వరకు అవకాశం ఇచ్చింది. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు రేపటితో గడువు ముగియనుంది. ఇక సీయూఈటీ యూజీ ప్రవేశ పరీక్ష మే 11 నుంచి 31 మధ్య ఆన్‌లైన్‌ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. ఈ పరీక్ష ద్వారా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2026-27 విద్యాసంవత్సరానికి పలు యూజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 13 భాషల్లో 37 సబ్జెక్టులకు ఈ పరీక్ష జరనుంది.

సీయూఈటీ యూజీ 2026 పరీక్ష పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *