Papikondalu: గోదావరి తీరంలో ప్రకృతి పరవళ్లు !! పాపికొండలకు పోటెత్తిన పర్యాటకులు

Papikondalu: గోదావరి తీరంలో ప్రకృతి పరవళ్లు !! పాపికొండలకు పోటెత్తిన పర్యాటకులు


ప్రకృతి అందాలకు నిలువెత్తు నిదర్శనం పాపికొండలు. అందుకే పాపికొండల సందర్శనకు పర్యాటకులు పోటెత్తుతుంటారు. సమ్మర్‌ సీజన్‌ మొదలవడంతో ప్రకృతి ప్రేమికులు విహారయాత్రలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ప్రకృతి ప్రేమికులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే పాపికొండలకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. గోదావరి నది పాయల మధ్య, ఎత్తైన కొండల అంచున సాగే ఈ జలవిహారం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి వందలాది కిలోమీటర్లు ప్రయాణించి పర్యాటకులు ఈ ప్రకృతి సౌందర్యాన్ని చూసేందుకు క్యూ కడుతున్నారు. వి.ఆర్. పురం మండలం పోచవరం బోట్ పాయింట్ ఇప్పుడు పర్యాటకుల రద్దీతో కళకళలాడుతోంది. ఆదివారం ఒక్కరోజే సుమారు 16 పర్యాటక బోట్లలో 1400 మందికి పైగా ప్రయాణికులు పాపికొండల యాత్రకు తరలివెళ్లారు. పోచవరం నుండి పేరంటాలపల్లి వరకు సాగే ఈ ప్రయాణంలో గోదావరి అలల సవ్వడి, కొండకోనల దృశ్యాలు యాత్రికులకు అపురూప అనుభూతిని మిగిలిస్తున్నాయి. యాత్రలో భాగంగా పేరంటాలపల్లిలోని ప్రాచీన శివాలయం, ముని మఠాలను పర్యాటకులు దర్శించుకున్నారు. కొండల పైనుంచి జాలువారే స్వచ్ఛమైన జలతరంగిణిల వద్ద యాత్రికులు ఉత్సాహంగా గడిపారు. అనంతరం స్థానిక కొండరెడ్లు వెదురుతో తయారు చేసిన కళాఖండాలను ఆసక్తిగా కొనుగోలు చేస్తూ గిరిజన సంస్కృతిని అభినందించారు. ప్రభుత్వం భద్రతా ప్రమాణాలను కఠినతరం చేయడంతో పర్యాటకులు నిశ్చింతగా ఈ జలవిహారాన్ని ఆస్వాదిస్తున్నారు. సెలవు దినాల్లో ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని పర్యాటక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్లీజ్.. మా దేశానికి రాకండి మహాప్రభో !

మద్యం లేకుండా పెళ్లి జరిపిస్తే రూ.51 వేలు గిఫ్ట్

స్టైల్ గా ఉరేసుకుంటూ రీల్ చేసిన మహిళ.. కట్ చేస్తే సీన్ రివర్స్

రాజమౌళి.. నీ చర్యలు ఊహాతీతం స్వామి.. ఇది కేవలం నీ ఒక్కడికే సాధ్యం

Gold Price Today: ఫ్లాష్ మాన్ లా పైపైకి పెరుగుతున్న బంగారం,వెండి ధరలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *