తెలంగాణలో మున్సిపల్ పోరుకు సర్వం సిద్దమైంది. ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలవరకు రాష్ట్రంలోని 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,996 వార్డుల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో సుమారు 12,993 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా 52 లక్షల మందిపైగా ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు.
ఈ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకునే ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. బుధవారం పట్టణ స్థానిక ఎన్నికలు జరిగే నగరపాలికలు, మున్సిపాలిటీల పరిధిలోని అందరూ కార్మికులు, ఉద్యోగులకు ఆ రోజు వేతనంతో కూడిన సెలవును ప్రకటిస్తూ కార్మికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఓటు ప్రతి ఒక్క పౌరుడి హక్కని ప్రతి ఒక్కరూ పోలింగ్‌లో పాల్గొని తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని పేర్కొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.