HVF Jobs 2026: హెవీ వెహికల్స్‌ ఫ్యాక్టరీలో జూనియర్ టెక్నీషియన్‌ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు!

HVF Jobs 2026: హెవీ వెహికల్స్‌ ఫ్యాక్టరీలో జూనియర్ టెక్నీషియన్‌ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు!


చెన్నైలోని హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ.. ఒప్పంద ప్రాతిదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 220 జూనియర్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

విభాగాల వారీగా ఖాళీల వివరాలు..

  • జూనియర్ టెక్నీషియన్ (మెషినిస్ట్) పోస్టుల సంఖ్య: 122
  • జూనియర్ టెక్నీషియన్ (ఆపరేటర్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్‌మెంట్) పోస్టుల సంఖ్య: 55
  • జూనియర్ టెక్నీషియన్ (రిగర్) పోస్టుల సంఖ్య: 25
  • జూనియర్ టెక్నీషియన్ (హీట్ ట్రీట్‌మెంట్ ఆపరేటర్) పోస్టుల సంఖ్య: 8
  • జూనియర్ టెక్నీషియన్ (సాండ్ & షాట్ బ్లాస్టర్) పోస్టుల సంఖ్య: 6
  • జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్ ఆటో ఎలక్ట్రిక్) పోస్టుల సంఖ్య: 4

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి 35 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 14, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. నింపిన దరఖాస్తులను ఈ కింది అడ్రస్‌కి పంపించాలి. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడౠ్ల్యబీడీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ట్రేడ్ టెస్ట్, మెరిట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.

అడ్రస్

చీఫ్ జనరల్ మేనేజర్, హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ, పోస్ట్ బ్యాగ్ నెం. 01, హెచ్‌వీఎఫ్ ఎస్టేట్, అవడి, చెన్నై – 600 054.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.www.ddpdoo.gov.in/www.avnl.co.in

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *