పాకిస్థాన్ వెనక్కి తగ్గింది. టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోమని ప్రకటిస్తూ వచ్చిన పాక్… ఇప్పుడు తన నిర్ణయం మార్చుకుంది. భారత్‌తో జరగాల్సిన లీగ్ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాక్.. లేటెస్ట్‌గా మనసు మార్చుకుంది. ఈ అంశంలో పాక్‌తో చర్చలు జరిపేందుకు ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా లాహోర్ వెళ్లారు. అక్కడ పీసీబీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సభ్యులతో ఆయన సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలోనే వెనక్కి తగ్గి మ్యాచ్ ఆడేందుకు పాక్ అంగీకరించింది.
చర్చల్లో భాగంగా పీసీబీ పలు ప్రతిపాదనలు ఐసీసీ ముందు ఉంచింది. భారత్- పాక్- బంగ్లాదేశ్ మధ్య త్రైపాక్షిక సిరీస్ నిర్వహించాలని కోరింది. అయితే ఐసీసీ తిరస్కరించింది. మరోవైపు టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పాకిస్థాన్‌ను అభ్యర్థించింది. క్రికెట్ వ్యవస్థ ప్రయోజనం కోసం భారత్-పాక్ మ్యాచ్ జరగాలని అభిప్రాయపడింది. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ఆడాలని పీసీబీని ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న శ్రీలంకలోని కొలంబోలో భారత్, పాక్ మధ్య టీ20 మ్యాచ్ జరిగేందుకు లైన్ క్లియర్ అయ్యింది.
ICC issues Press Release #INDvsPAK #T20WorldCup pic.twitter.com/HqwFXWpdmS
— Ankan Kar (@AnkanKar) February 9, 2026
Bangladesh Cricket Board acknowledges Pakistan Cricket Board and ICC for their positive role and solidarity.
#BCB #Cricket #Bangladesh #Tigers pic.twitter.com/yfwReDwvzc— Bangladesh Cricket (@BCBtigers) February 9, 2026