మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముందు షాకింగ్‌ ఘటన.. బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య..!

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముందు షాకింగ్‌ ఘటన.. బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య..!


నారాయణపేట జిల్లా మక్తల్‌ మున్సిపాలిటీలో షాకింగ్‌ ఘటన జరిగింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముందు విషాదం చోటు చేసుకుంది. మక్తల్ మున్సిపాలిటీలో 6 వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎరుకలి మహాదేవ్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నామినేష్ వేసినప్పటి నుంచి మహాదేవ్‌ను ప్రత్యర్థులు భయబ్రాంతులకు గురి చేస్తుశారని కుటుంబ సభ్యుల ఆరోపిస్తు్న్నారు. వారి వేధింపులు భరించలేక ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఫిబ్రవరి 11న పోలింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 9, సోమవారంతో ప్రచారం ముగిసింది. అయితే చివరి రోజు సోమవారం ఎంపీ డీకే అరుణతో ప్రచారంలో పాల్గొన్న మహదేవ్.. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మున్సిపల్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ముందు నుంచే మహదేవ్‌పై ఒత్తిళ్లు ఉన్నాయని కుటుంబసభ్యులు తెలిపారు. రేపు బుధవారం ఎలక్షన్‌ ఉండడంతో కొందరు బెదిరించడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. ప్రత్యర్థి అభ్యర్థుల బెదిరింపుల వల్లే ఇతను సూసైడ్‌ చేసుకున్నారా.. వేరే కారణం ఉందా అనే దానిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *