Actress : ఆ సినిమా ప్లాప్ అయ్యాక రాత్రంతా ఏడ్చేసా.. బయటకు రావడానికి 8 నెలలు పట్టింది.. హీరోయిన్..

Actress : ఆ సినిమా ప్లాప్ అయ్యాక రాత్రంతా ఏడ్చేసా.. బయటకు రావడానికి 8 నెలలు పట్టింది.. హీరోయిన్..


టాలీవుడ్ హీరోయిన్ ధన్య బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేను శైలజ సినిమాతో తెలుగులో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కొత్త దర్శకులతో పనిచేయడంపై తన ఆలోచనలు, అనుభవాలను పంచుకున్నారు. కొత్త దర్శకులను నమ్మడానికి గల ప్రధాన కారణం వారిలోని స్పష్టమైన ఆలోచన, నిజాయితీ, అభిరుచి, అంకితభావమేనని ఆమె అన్నారు. గతంలో కొన్ని సినిమాలు చెప్పిన కథకు, తెరపై చూపించిన దానికి తేడాలు ఉన్నప్పటికీ, తాను మోసపోయానని ఎప్పుడూ భావించలేదని తెలిపారు. దర్శకుల కృషి, కష్టాలు తనను ఆకట్టుకుంటాయని, అందుకే సినిమా ఫలితం ఎలా ఉన్నా వారితో పనిచేయడానికి సిద్ధపడతానని పేర్కొన్నారు. హిట్, ఫ్లాప్ అనేవి జీవితంలో సహజమని, కానీ ఇండస్ట్రీలో ఉండే బంధాలు, కుటుంబ భావన ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీ తనను నమ్మి పని ఇస్తూనే ఉందని, అందుకే తరచుగా పనిచేయగలుగుతున్నానని ధన్య బాలకృష్ణ తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..

విజయాలు, అపజయాలను సమానంగా స్వీకరించే మనస్తత్వం గురించి అడగగా, ప్రారంభంలో అపజయాలు తనను తీవ్రంగా నిరుత్సాహపరచాయని, రాత్రులు నిద్రపట్టేది కాదని ధన్య బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. ఒక సినిమా విడుదలైన తర్వాత అది ఆడకపోతే చాలా నిరాశపడేదానినని చెప్పారు. “సెకండ్ హ్యాండ్” అనే సినిమా తనకు చాలా ఆశలు కల్పించిందని, దానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారని తెలిపారు. మంచి కామెడీగా భావించినప్పటికీ, ఆ సినిమా తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదని, సుప్రసిద్ధ దర్శకులు, హీరోలతో పనిచేయాలనే తన కోరిక నెరవేరలేదని ఆమె వివరించారు. ఆ నిరాశ నుండి బయటపడటానికి ఆరు నుండి ఎనిమిది నెలలు పట్టిందని ధన్య బాలకృష్ణ పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..

అయితే, ఇప్పుడు సినిమా ఫలితం తన చేతుల్లో ఉండదని, తన పనిని తాను సక్రమంగా చేయడమే ముఖ్యమని ఆమె గ్రహించారు. ఒక నటిగా తనకు డబ్బులు ఇస్తున్నారని, మంచి వసతి, ఆహారం అందిస్తున్నారని, ఇవన్నీ ఇతర కార్పొరేట్ ఉద్యోగాలలో లభించవని ఆమె అన్నారు. తాను ఐటీ ఉద్యోగాన్ని వదులుకొని, తల్లిదండ్రుల అభ్యంతరాలను అధిగమించి సినిమా రంగంలోకి వచ్చానని ధన్య బాలకృష్ణ తెలిపారు. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి, సురక్షితమైన కెరీర్‌ను వదులుకొని అభిరుచిని వెంబడించడం అరుదైన అవకాశమని ఆమె అన్నారు.

ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *