Honey Badger: పాము కరిచినా చావదు.. సింహనికే సుస్సుపోయించే భయపడని జంతువు..

Honey Badger: పాము కరిచినా చావదు.. సింహనికే సుస్సుపోయించే భయపడని జంతువు..


హనీ బ్యాడ్జర్.. శాస్త్రీయంగా మెల్లివోరా క్యాపెన్సిస్ అని పిలిచే ఈ జంతువు.. ప్రపంచంలోనే అత్యంత భయంలేని, ధైర్యమున్న జంతువులలో ఒకటిగా పిలుస్తారు. చిన్న ఎలుగుబంటిని పోలి ఉండే ఈ జీవి.. తన పరిమాణం కంటే చాలా పెద్దవైన సింహాలు, చిరుతలు, అత్యంత విషపూరితమైన పాములను కూడా ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉంటుంది.

ఆఫ్రికా, నైరుతి ఆసియా, భారత ఉపఖండంలోని అడవులు, ఎడారులు, రాతి కొండలలో ఇవి ఎక్కువగా నివసిస్తాయి. హనీ బ్యాడ్జర్‌లకు అద్భుతమైన తెలివితేటలు, ఈత కొట్టడం, చెట్లు ఎక్కడంలో నైపుణ్యం ఉంది. ఆహారం విషయానికి వస్తే, వీటికి తేనె అంటే చాలా ఇష్టం. తేనెతో పాటు, ఇవి పాములు, తేనెటీగల గూళ్లు, పక్షులు, ఎలుకలు, మరియు ఇతర చిన్న సరీసృపాలు, క్షీరదాలను కూడా ఆహారంగా తీసుకుంటాయి. దీని శరీరంపై ఉన్న బలిష్టమైన చర్మం విష సర్పాల కాటును సైతం తట్టుకోగలదు. అంతేకాకుండా, వాటి పదునైన పంజాలు, బలమైన దవడలు వేటాడడానికి, తనను తాను రక్షించుకునేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటి అసాధారణ ధైర్యసాహసాలకు గానూ, హనీ బ్యాడ్జర్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో “ప్రపంచంలోనే అత్యంత ధైర్యవంతులైన” జంతువుగా చోటు సంపాదించింది. భారత్‌లో, వీటిని పాపికొండలు అభయారణ్యం, కావేరి వన్యప్రాణి ధామంలో అధికారులు గుర్తించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *