Gold Price Today: ఫ్లాష్ మాన్ లా పైపైకి పెరుగుతున్న బంగారం,వెండి ధరలు

Gold Price Today: ఫ్లాష్ మాన్ లా పైపైకి పెరుగుతున్న బంగారం,వెండి ధరలు


బంగారం ధరలు మళ్ళీ పెరుగుదల స్టార్ట్ చేశాయి. ఈ మధ్య కాలంలో భారీగా పతనమైన పసిడి ధరలు తాజాగా ఎగబాకుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చక్కబడిన భౌగోళిక, రాజకీయ పరిస్థితులు మళ్లీ ఆందోళనకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే దీనికి కారణమవుతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు మళ్లీ సేఫ్ హెవెన్ గా బంగారాన్ని భావిస్తున్నారు. తమ ఇన్వెస్ట్ మెంట్లను తరలిస్తున్నారు. దీంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ఫిబ్రవరి 9 సోమవారం 24 క్యారెట్ల బంగారం పై రూ.2,240 లు పెరిగి రూ.1,58,840 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.2,050లు పెరిగి రూ.1,45,600కు చేరింది. వెండి విషయానికి వస్తే కిలో వెండిపై ఏకంగా రూ.15,000లు పెరిగి రూ.3,00,000లకు చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో సోమవారం బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. దేశరాజధాని ఢిల్లీలో ఇక 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,58,990 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,45,750 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,840, అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,600లు పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,59,820 వద్ద ట్రేడవుతుండగా… 22 క్యారెట్ల బంగారం రూ.1,46,500 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,58,840లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,45,600 పలుకుతోంది. వెండి కిలో రూ. 3,00,000గా ఉంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌ చేసుకుంటే మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నైజాం డిస్ట్రిబ్యూషన్ వార్.. రేసులో ఆ నలుగురు

Sukumar: రంగస్థలంను టార్గెట్ చేస్తున్న లెక్కల మాస్టారు.. ఫ్యాన్స్‌కు పండగే

Trivikram Srinivas: పాపం గురూజీ.. ఆ ఇద్దరి మధ్యా నలిగిపోతున్నాడుగా

Ramayana: ఊహకందని రామాయణ.. ఆ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్

తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *