కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల వృత్తి, వ్యాపారాల్లో పురోగతి స్తంభించిపోవడం, లాభాలు తగ్గడం, పదోన్నతులు ఆగిపోవడం, పెళ్లి ప్రయత్నాలు ఫలించకపోవడం, ప్రేమ వ్యవ హారాల్లో ఆటంకాలు ఏర్పడడం, ఉద్యోగం లభించకపోవడం, దుర్వార్తలు ఎక్కువగా వినడం వంటివి జరిగే అవకాశం ఉంది. శివరాత్రి రోజున శివార్చన చేయడం లేదా శివాష్టకం చదువుకోవడం వల్ల తప్పకుండా ఈ సమస్యల నుంచి బయటపడి, బాగా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది.