1, 2 కాదు భయ్యో.. ఏకంగా 12 వికెట్లతో రప్ఫాడించిన రూ. 8.40 కోట్ల ఐపీఎల్ సెన్సేషన్.. ఎవరంటే?

1, 2 కాదు భయ్యో.. ఏకంగా 12 వికెట్లతో రప్ఫాడించిన రూ. 8.40 కోట్ల ఐపీఎల్ సెన్సేషన్.. ఎవరంటే?


Auqib Nabi: రంజీ ట్రోపీ సీజన్ రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో జమ్మూ కాశ్కీర్ వర్సెస్ మధ్య ప్రదేశ్ జట్ల మధ్య జరిగింది. ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో జమ్మూకాశ్మీర్ జట్టు 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ విజయంలో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ ఔకిబ్ నబీ హీరోగా నిలిచాడు. మొత్తంగా 12 వికెట్లు పడగొట్టి జమ్మూ కాశ్మీర్ విజయానికి బాటలు వేశాడు. ఈ ఫలితం జమ్మూకు కూడా ఎంతో చారిత్రత్మకమైనదిగా మారింది. ఎందుకంటే, దేశవాళీ క్రికెట్ లో 66 ఏళ్ల తర్వాత తొలిసారి రంజీ ట్రోపీ సెమీస్ కు చేరడం విశేషం.

తొలి రంజీ సెమీస్ ఆడనున్న జమ్మూ కాశ్మీర్..

291 పరుగుల టార్గెట్ ఛేజింగ్ చూస్తూ మధ్యప్రదేశ్ జట్టు కేవం 68.3 ఓవర్లలో 234 పరుగులకే తేలిపోయింది. ఈ క్రమంలో బౌలర్ ఔకిబ్ నబీ 5 వికెట్లు పడగొట్టి మధ్యప్రదేశ్ జట్టును చావు దెబ్బ తీశాడు. ఈ బౌలర్ తన 24 ఓవర్లలో కేవలం 70 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు పడగొట్టాడు. కేవలం 18.4 ఓవర్లలో 7/40 ఉత్తమ గణాంకాలను నమోదు చేశాడు. ఈ డేంజరస్ బౌలింగ్ తో జమ్మూ కాశ్మీర్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 42 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇలా రెండు ఇన్నింగ్స్ ల్లో 110 పరుగులు ఇచ్చి 12 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఔకిబ్ నమీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

ఐపీఎల్ 2026 కోసం సిద్ధం..

ఔకిబ్ నబీ కెరీర్ పరిశీలిస్తే.. రంజీ ట్రోఫీలో ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ ల్లో కేవలం 14 ఇన్నింగ్స్ ల్లో 46 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో ఈ 29 ఏళ్ల జమ్మూ సంచలనం టోర్నమెంట్ లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో మయాంక మిశ్రా ఉన్నాడు. నబీ సగటున 12.54 గాఉంది.

ఇదే ఉత్సాహాంతో ఐపీఎల్ 2026లో చేరేందుకు సిద్ధమయ్యాడు. వచ్చే సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడనున్న ఔకీబ్.. వేలంలో రూ. 8.40 కోట్లకు అమ్ముడయ్యాడు. ప్రశాంత్ వీర్ తర్వాత అత్యధిక ధర పొందిన అన్ క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్లలో ఒకడిగా ప్రత్యేక గుర్తింపు పొందాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *