IND vs NED: నమీబియాతో మ్యాచ్ నుంచి ఇద్దరు ఔట్.. ప్రయోగాలకే ఒకే చెప్పిన గంభీర్.. ఎవరంటే..?

IND vs NED: నమీబియాతో మ్యాచ్ నుంచి ఇద్దరు ఔట్.. ప్రయోగాలకే ఒకే చెప్పిన గంభీర్.. ఎవరంటే..?


India vs Netherlands, 36th Match, Group A, ICC Mens T20 World Cup 2026: టీమిండియా తొలి మ్యాచ్ లో అమెరికాతో తలపడి విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్ లో నమీబియాతో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్ లో చోటు దక్కని ఇద్దరి ప్లేయర్లు రెండో మ్యాచ్ లో ఆడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కోచ్ గంభీర్ కూడా ఈ ఇద్దరిని ఆడించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ లో ఈ ఇద్దరు టీమిండియా యాజమాన్యాన్ని ఆకట్టుకున్నారని, అందుకే నమీబియాతో ఆడించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు ఎవరో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం లీగ్ దశ మ్యాచ్ లు జరగుతున్నాయి. అన్ని జట్లు కూడా తమ స్వ్కాడ్ లను బలోపేతం చేసేందుకు బెంచ్ ఆటగాల్లకు కూడా అవకాశాలు ఇవ్వాలని చూస్తోంది. ఈ క్రమంలో టీమిండియా కూడా తమ బెంచ్ బలాన్ని టెస్ట్ చేయాలని చూస్తోంది. అందుకే సూపర్ 8 కు ముందు బెంచ్ ఆటగాళ్లను బరిలోకి దించనుంది. ఫిబ్రవరి 12న ఢిల్లీలో నమీబియాతో జరిగే తదుపరి మ్యాచ్ కు ముందు ప్లేయింగ్ 11లో మార్పు జరగనుంది. తొలి మ్యాచ్ మిస్సయిన ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా జట్టులోకి రావడం ఖాయమైంది. మహ్మద్ సిరాజ్ స్థానంలో బుమ్రా రావొచ్చని భావిస్తున్నారు. కానీ తొలి మ్యాచ్ లో సిరాజ్ అద్భుతంగా ఆకట్టుకున్నాడు. మరి నమీబియాతో సిరాజ్ ను తప్పించే ప్రయత్నం చేస్తారా లేదా అని చూడాలి. అలాగే, రింకూ సింగ్ స్థానంలో సంజూ శాంసన్ కు అవకాశం ఇవ్వవచ్చని తెలుస్తోంది. అమెరికాతో జరిగిన మ్యాచ్ లో రింకూ విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో లీగ్ దశలోనే కాంబినేషన్ ప్రయత్నాలు చేసేందుకు గంభీర్ సంచలన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది.

తొలి మ్యాచ్ లో రింకూ, సిరాజ్ ల ప్రదర్శన..

బుమ్రా స్థానంలో ప్లేయింగ్ 11లోకి వచ్చిన సిరాజ్.. కీలక దశలో అమెరికా 2 వికెట్లు పడగొట్టి, భారత జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. తన 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు రింకూ సింగ్ కేవలం 14 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేశాడు.

భారత జట్టు తదుపరి మ్యాచ్ లు..

భారత జట్టు తదుపరి మ్యాచ్ లను పరిశీలిస్తే.. ఫిబ్రవరి 12 న నమీబియాతో, ఫిబ్రవరి 15 న పాకిస్తాన్ జట్టుతో, ఇక చివరి మ్యాచ్ ఫిబ్రవరి 18న నెదర్లాండ్స్ తో తలపడనుంది. ముఖ్యంగా నమీబియాతో మ్యాచ్ లో ప్రయోగాలకే పట్టం కట్టేందుకు గంభీర్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఆ తర్వాత పాకిస్తాన జట్టుతో మ్యాచ్ జరుగుతుందా లేదా తెలియదు. ఒకవేళ జరిగితే, దాయాదిపై బలమైన జట్టుతో బరిలోకి దిగాలని గంభీర్ చూస్తున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *