ఆ సమయంలో చాలా ఏడ్చా.. ఎమోష్నలైన యంగ్ బ్యూటీ కాయదు లోహర్

ఆ సమయంలో చాలా ఏడ్చా.. ఎమోష్నలైన యంగ్ బ్యూటీ కాయదు లోహర్


ఆ సమయంలో చాలా ఏడ్చా.. ఎమోష్నలైన యంగ్ బ్యూటీ కాయదు లోహర్

కాయదు లోహర్.. డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. కాయదు లోహర్.. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తన నటనతో ఈ చిన్నది మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆమె 2000 ఏప్రిల్ 11న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించింది. ఇక తెలుగులో ఈ బ్యూటీ అల్లూరి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు తెలుగులో బిజీ కానుంది. ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఫంకీ సినిమలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది కాయదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది.

నటి కాయదు లోహర్ తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. మోడలింగ్ రంగం నుంచి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి ప్రస్తుత స్థాయికి చేరుకోవడం వెనుక తన కృషి, పట్టుదల ఉన్నాయని తెలిపింది ఈ ముద్దుగుమ్మ.. తన కెరీర్ ఆరంభంలో, కొన్ని సంవత్సరాల క్రితం, ఒకానొక సమయంలో తాను బాల్కనీలో కూర్చుని ఆలోచిస్తూ, “ఏమవుతోంది? ఏదీ వర్కవుట్ అవ్వడం లేదు. అంతా చాలా నెమ్మదిగా ఉంది. నేను దీన్ని చేయగలనో లేదో నాకు తెలియదు” అని నిరాశకు లోనయ్యానని గుర్తు చేసుకుంది కాయదు. తనలో పని చేయాలనే శక్తి, తనను తాను నిరూపించుకోవాలనే తపన ఉన్నప్పటికీ సరైన అవకాశాలు లభించలేదని తెలిపింది.

మోడలింగ్ చేసేటప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు తాను ఈ పరిశ్రమలో ఉండాలని అనుకున్నా.. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం నిరంతరం శ్రమించానని తెలిపింది. తనకు తెలిసింది ఒకటేనని, కష్టపడాలి, చిత్తశుద్ధితో ఉండాలి, చాలా బాధ్యతగా వ్యవహరించాలి.. పరిశ్రమలో తనకంటూ ఎలాంటి అండదండలు లేవని, పరిచయస్తులు గానీ, అవకాశాలు ఇచ్చే కుటుంబ సభ్యులు గానీ లేరని చెప్పుకొచ్చింది. ప్రతి ప్రాజెక్ట్, ప్రతి ఆడిషన్ కోసం తనను తాను నిరూపించుకోవాల్సి వచ్చిందని, ఇతరుల కంటే వంద శాతం ఎక్కువ కష్టపడాల్సి వచ్చిందని తెలిపింది.

కొన్ని రోజులు ఎంత కష్టపడినా ఫలితం కనిపించక, ఏమి చేయాలో తెలియక చాలా బాధపడ్డానని, డిప్రెషన్‌లో కూడా ఉన్నానని, అనేక భావోద్వేగాలను ఎదుర్కొన్నానని తెలిపింది కాయదు. పెద్ద ప్రాజెక్టులు, ఆడిషన్స్‌లో అవకాశాలు కోల్పోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అప్పుడు తనకు భాషపై అంత పట్టు లేకపోవడం ఒక కారణమని చెప్పుకొచ్చింది. ఆడిషన్‌కు కేవలం గంట ముందు డైలాగులు ఇచ్చేవారని, భాషను సులభంగా గ్రహించేంత స్మార్ట్‌గా తాను లేనందున చాలా అవకాశాలు చేజారిపోయాయని.. ఆ సమయంలో చాలా బాధపడి, ఏడ్చానని, కానీ జరిగినవన్నీ సరైన కారణాలకే జరిగాయని తాను నమ్ముతున్నానని కాయదు చెప్పుకొచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by kayadulohar (@kayadu_lohar_official)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *