Harsha Veena: పవన్ సార్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్.. మీ దగ్గర మొత్తం బయట పెడత

Harsha Veena: పవన్ సార్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్.. మీ దగ్గర మొత్తం బయట పెడత


రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ వ్యవహారంలో బాధితురాలు హర్ష వీణ తాజాగా మరో వీడియో విడుదల చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తరంశెట్టి నాగేంద్ర లాంటి వారు పవన్ కళ్యాణ్‌కు తప్పుడు సమాచారం ఇస్తూ తన విషయంలో తప్పుదారి పట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను పంచాయతీ రాజ్ శాఖకు చెందిన మహిళను కాబట్టి, తన శాఖా మంత్రి అయిన పవన్ కళ్యాణ్‌ను కలిసి అన్ని ఆధారాలు సమర్పించేందుకు అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. ఎమ్మెల్యే పదవి లేకపోతే శ్రీధర్ ఈపాటికే జైలులో ఉండేవారని, తనది తప్పని తేలితే తనను చంపేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జనసేన పార్టీకి చెందిన వారు కావడంతోనే, పార్టీ అధినేతకు అసలు నిజాలు వివరించాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. నాగేంద్ర లాంటి వ్యక్తులకు భయపడేది లేదని, తన పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని వీణ ఈ వీడియోలో హెచ్చరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్టైల్ గా ఉరేసుకుంటూ రీల్ చేసిన మహిళ.. కట్ చేస్తే సీన్ రివర్స్

గాజు సీసాలో తిరుమల శ్రీవారి ఆలయ గోపురం

కాలువలో పడ్డ కారు.. కాపాడమంటూ ఆర్తనాదాలు.. చివరికి..

అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళ.. చెక్‌ చేయగా

ప్లీజ్.. మా దేశానికి రాకండి మహాప్రభో !



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *