ఈ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్ ఆత్మహత్య చేసుకున్నారు.. మరో హీరోయిన్ నిద్రమాత్రలు మింగి..

ఈ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్ ఆత్మహత్య చేసుకున్నారు.. మరో హీరోయిన్ నిద్రమాత్రలు మింగి..


కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. అలాంటి సినిమాల్లో ఈ మూవీ ఒకటి. ఈ సినిమాలో నటించిన హీరోకి విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా అమ్మాయిల్లో అతనికి విపరీతమైన ఫ్యాన్స్ ఉండేవారు. అలాగే తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆ హీరో ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకొని కన్నుమూశాడు. ఆయన మరణవార్త విని అభిమానులంతా కన్నీరు మున్నీరయ్యారు. అంతే కాదు ఈ సినిమాలో హీరోయిన్ కూడా కన్నుమూసింది. ఆ సినిమా హీరోయిన్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. అంతే కాదు ఈ సినిమాలో నటించిన మరో హీరోయిన్ కూడా ఆత్మహత్యాయత్నం చేసింది కానీ ఆమె ప్రాణాలతో బయటపడింది. ఇంతకూ ఈ సినిమా ఎదో తెలుసా.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ చాలా మంది ఫెవరేట్ మూవీ.

ఆ సినిమా మరేదో కాదు టాలీవుడ్ క్లాసిక్ హిట్ గా నిలిచినా కలుసుకోవాలని.. ఉదయ్ కిరణ్, గజాల, ప్రత్యూష కలిసి నటించారు. 2002 లో రఘురాజ్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ అయ్యాయి. సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అవకాశాలు తగ్గడంతో పాటు కుటుంబ సమస్యల కారణంగా ఉదయ్ ఆత్మహత్య చేసుకున్నారు.

అలాగే హీరోయిన్ ప్రత్యూష మరణం ఇప్పటికీ మిస్టరీనే.. ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందని కొన్ని వార్తలు, లేదు హత్య చేశారంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అలాగే మరో హీరోయి గజాల కూడా ఆత్మహత్య యత్నం చేసింది. హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న గజాల కెరీర్ పీక్ లో ఉండగానే ఆత్మహత్యాయత్నం చేసింది. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది.. సరైన సమయానికి ఆమె స్నేహితులు వచ్చి కాపాడారు. ఇలా కలుసుకోవాలని సినిమాలో నటించిన హీరో, ఇద్దరూ హీరోయిన్స్ ఆత్మహత్య యత్నం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *