ప్రాణాలు తీసిన పతంగి.. బిల్డింగ్‌పై నుంచి పడి బాలుడు మృతి!

ప్రాణాలు తీసిన పతంగి.. బిల్డింగ్‌పై నుంచి పడి బాలుడు మృతి!


హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లిలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. బల్డింగ్‌పై పతంగి ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు ఓ బాలుడి టెరస్‌పై నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. సాయిబాబా నగర్‌లో నివాసం ఉంటున్న హేమంత్ అనే 10 ఏళ్ల బాలుడు సరదాగా బిల్డింగ్‌పై గాలిపటం ఎగురవేస్తున్నాడు.. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు టెరస్‌పై నుంచి పడిపోయాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హేమంత్‌ను హాస్పిటల్‌కు తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *