Anantapur district: పాపంరా.. యువ మహిళా ఎమ్మెల్యేపై చేతబడి.. 2 నెలలుగా అనారోగ్యం..

Anantapur district: పాపంరా.. యువ మహిళా ఎమ్మెల్యేపై చేతబడి.. 2 నెలలుగా అనారోగ్యం..


అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ పాలిటిక్స్ ఇప్పుడు నిమ్మకాయలు, పసుపు, కుంకుమల చుట్టూ తిరుగుతోంది. నగరంలోని అరవింద్ నగర్‌‌లో గల సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి దగ్గర క్షుద్ర పూజల కలకలం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్షుద్ర పూజలు వెనుక ఏదో పెద్ద కుట్రే ఉందని ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుమానిస్తున్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే చేతబడి.. క్షుద్ర పూజలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే బండారు శ్రావణి మండిపడుతున్నారు. యువ మహిళా ఎమ్మెల్యే.. చురుగ్గా నియోజకవర్గంలో దూసుకుపోతుంటే… ఆమెకు అడ్డుకట్ట వేసేందుకు… దూకుడుకు కళ్ళెం వేసేందుకు బ్లాక్ మ్యాజిక్ పాలిటిక్స్ ప్రయోగించారా అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి ప్రత్యర్ధుల నుంచి కంటే.. సొంత పార్టీలోని గ్రూపు రాజకీయాలే పెద్ద తలనొప్పిగా మారాయి. ఎమ్మెల్యే అవ్వకముందు నుంచి బండారు శ్రావణికి నియోజకవర్గంలో సొంత పార్టీ నాయకులు నుంచి వ్యతిరేకవర్గం బలంగా ఉంది. తనను మానసికంగా దెబ్బతీసేందుకే ఎవరు ఈ క్షుద్ర పూజల డ్రామా ఆడుతున్నారా అన్న అనుమానం కూడా ఎమ్మెల్యేలో ఉంది.. ఎందుకంటే గత కొన్ని నెలలుగా బండారు శ్రావణి తల్లిదండ్రులకు అనారోగ్య సమస్యలు తరచూ వస్తున్నాయని.. అదే విధంగా రెండు నెలలుగా తనకు కూడా ఆరోగ్యం బాగుండటం లేదని ఎమ్మెల్యే బండారు శ్రావణి చెప్పడం గమనార్హం.

ఈనెల 6వ తేదీ ఉదయం 9 గంటల సమయంలో షిఫ్ట్ కార్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఎమ్మెల్యే బండారి శ్రావణి ఇంటిముందు నిమ్మకాయలు… పసుపు, కుంకుమ…. తెల్ల రాగులు, నువ్వులు విసిరేసి పారిపోయారని ఎమ్మెల్యే బండారు శ్రావణి చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఓ సిసి ఫుటేజ్‌ను కూడా బయటపెట్టారు. గుర్తుతెలియని వ్యక్తులు వచ్చిన కారు నెంబర్ ఆధారంగా  ఇప్పటికే పోలీసులు విచారణ చేపట్టారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి దగ్గరికి వచ్చిన కారు గుంటూరుకు చెందిన వాణిజ్య పన్నుల శాఖలో ఏఓగా పని చేస్తున్న ఆదిలక్ష్మి పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు విచారణలో తేలింది. అయితే ఆ కారు తాను అమ్మేసినట్లు కారు ఓనర్ ఆదిలక్ష్మి పోలీసులకు తెలిపారు. అయితే ఇప్పుడు ఆ కారు ఎవరు కొనుగోలు చేశారు… అసలు ఆరోజు ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు క్షుద్ర పూజలు చేసిన నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, తెల్ల రాగులు, నువ్వులు ఇంటి ముందు పడేసి వెళ్లిన వ్యక్తులు ఎవరు అన్నది సస్పెన్స్ గా ఉంది. ప్రత్యర్ధుల కంటే… సొంత పార్టీ నాయకుల వైపే ఈ క్షుద్ర పూజల అంశం వేలెత్తి చూపుతోంది.

మొత్తానికి ఇంత టెక్నాలజీ పెరిగాక ఇంకా ఈ క్షుద్ర పూజల రాజకీయం ఏంటని జిల్లాలో జనం ముక్కున వేలేసుకుంటున్నారు. మంత్ర, తంత్రాల రాజకీయ సెగలు సింగనమల రాజకీయాన్ని ఎటు తీసుకెళ్తాయో చూడాలి.

Also Read: అక్కడ పది రోజుల పాటు చికెన్‌, ఎగ్స్‌ తినకపోవడం మంచిది..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *