Double Bed Room Scheme: డబుల్ బెడ్ రూం ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వారందరికీ ఇళ్లు.. త్వరలోనే ఫిక్స్..

Double Bed Room Scheme: డబుల్ బెడ్ రూం ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వారందరికీ ఇళ్లు.. త్వరలోనే ఫిక్స్..


తెలంగాణలో సొంత ఇల్లు లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. డబుల్ బెడ్ రూం ఇళ్లపై కీలక ప్రకటన చేసింది. మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను త్వరలో మొదలుపెట్టనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను త్వరలో ప్రారంభిస్తామని, వాటిని పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తామని ఆయన తెలిపారు. మన్సిపల్ ఎన్నికల సందడి రాష్ట్రవ్యావ్యాప్తంగా నెలకొంది. ప్రచారానికి కొద్ది సమయం మాత్రమే ఉండటంతో పార్టీలన్నీ హోరాహోరీగా హోరెత్తిస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేస్తుండగా.. ఇక మంత్రులందరూ కూడా తమ ప్రాంతాల్లో గెలుపు కోసం కృషి చేస్తున్నారు.

అర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు

ఈ క్రమంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం కరీంనగర్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలో పర్యటించిన ఆయన.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు పలు హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే కరీంనగర్‌ను అభివృద్ది చేసి చూపిస్తామంటూ హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామన్నారు. అలాగే గత 10 ఏళ్లల్లో నియోజకవర్గంలో 600 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించకుండా మధ్యలో ఆపివేశారని, వాటిని త్వరలోనే నిర్మించి ఇస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన అన్ని ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందస్తామని స్పష్టం చేశారు. ఇక తమ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు అనేక పథకాలను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.

భట్టి విక్రమార్క కీలక ప్రకటన

ఇక ఇందిరమ్మ ఇళ్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. మున్సిపాలిటీల్లో అర్హులైన ప్రతీఒక్కరికీ త్వరలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామాల్లోని లబ్దిదారులకు ఇప్పటివరకు 4 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, త్వరలో పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా మంజూరు చేస్తామని చెప్పారు. ఇక స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని, అలాగే స్థలం లేనివారికి జీ ప్లస్ 2 తరహాలో ఇళ్లు ఇస్తామని వెల్లడించారు. అటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్‍లో ఆదివారం నిర్వహించిన ‘ప్రజాపాలన-ప్రగతి బాట’ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు. ఈ ఐదేళ్లల్లో విడతల వారీగా అర్హులైనవారందకి ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇప్పటికే 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, త్వరలో గృహప్రవేశాలు ఉంటాయన్నారు. మున్సిపాలిటీల్లోనూ పేదలకు ఇందిరమ్మ ఇళ్ల ఇస్తామన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *