U19 World Cup 2026: స్వదేశానికి టీమిండియా యువ ఛాంపియన్లు.. ఘనస్వాగతం పలికిన అభిమానులు

U19 World Cup 2026: స్వదేశానికి టీమిండియా యువ ఛాంపియన్లు.. ఘనస్వాగతం పలికిన అభిమానులు


ఫిబ్రవరి 6, శుక్రవారం నాడు, ఆయుష్ మాత్రే నేతృత్వంలోని భారత యువ జట్టు ఇంగ్లాండ్‌ను ఓడించి 2026 అండర్-19 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుంది. భారత జట్టు అండర్-19 ఛాంపియన్‌గా నిలిచడం ఇది ఆరోసారి. ఈ చారిత్రాత్మక విజయం అందిన 2 రోజుల తర్వాత, కెప్టెన్ ఆయుష్ మాత్రే టీం స్వదేశానికి తిరిగి వచ్చారు. యువ ఛాంపియన్‌లు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో వారికి ఘన స్వాగతం లభించింది.

యువ జట్టును చూసేందుకు క్రికెట్ అభిమానులు విమానాశ్రయంలో గుమిగూడారు. అలాగే, ప్రపంచ ఛాంపియన్ ఆటగాళ్లను స్వాగతించడానికి ఆయుష్ కుటుంబంతోపాటు వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్రా కుటుంబం విమానాశ్రయంలో ఉన్నారు. విమానాశ్రయానికి చేరుకున్న ఆయుష్‌కు ఘన స్వాగతం లభించింది. అభిమానులు ఇచ్చిన స్వాగతం చూసి మొత్తం జట్టు ఆశ్చర్యపోయింది.

జింబాబ్వేలోని హరారేలో జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌లో భారత్ 100 పరుగుల తేడాతో గెలిచి ఆరోసారి టైటిల్‌ను గెలుచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లతో 175 పరుగులు చేశాడు. కెప్టెన్ ఆయుష్ 51 బంతుల్లో 53 పరుగులు జోడించగా, అభిజ్ఞాన్ కుండు 31 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ తరపున కాలేబ్ ఫాల్క్‌నర్ 115 పరుగుల ఇన్నింగ్స్ ఆడి ఒంటరి పోరాటం చేశాడు. కానీ అది జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *