Headlines

Pawan Kalyan: పవన్ మాస్టర్ ప్లాన్.. ఆ ఐడియాకే దండం

Pawan Kalyan: పవన్ మాస్టర్ ప్లాన్.. ఆ ఐడియాకే దండం


పవన్ కళ్యాణ్ పొలిటికల్ బిజీ ఆయన చేయబోయే ఫ్యూచర్ సినిమాలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుంది..? ఓ వైపు సురేందర్ రెడ్డి.. మరోవైపు OG 2 సినిమాలతో పాటు ప్రొడక్షన్ బాధ్యతలను పాలిటిక్సకు అతీతంగా పవర్ స్టార్ ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు..? ఈ ఏడాది ఉస్తాద్ కాకుండా ఏదైనా సినిమాలు రానున్నాయా..? పవన్ ఫ్యూచర్ ప్లాన్‌పై స్పెషల్ స్టోరీ.. OG ముందు వరకు పవన్ వరసగా సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ ఆ తర్వాత మళ్లీ రాజకీయాల వైపే వచ్చేసారు. బ్యాలెన్స్ ఉన్న ఉస్తాద్ వర్క్ పూర్తి చేసాక.. కంప్లీట్‌గా పోకస్ అంతా పాలిటిక్స్‌పైకి షిఫ్ట్ చేసారు పవర్ స్టార్. ఇప్పుడైతే ఆయన పొలిటికల్ షెడ్యూల్ మామూలుగా లేదు. ఇలాంటి సమయంలో 2 సినిమాలకు ఓకే చెప్పారు పవన్. ఆల్రెడీ ఉస్తాద్ షూటింగ్ అయిపోయింది.. డబ్బింగ్ కూడా ఫిబ్రవరిలోనే పూర్తి చేయనున్నారు. ఉస్తాద్ మార్చి 26న విడుదల కానుంది. మరోవైపు ఉగాది రోజు సురేందర్ రెడ్డి సినిమాకు ముహూర్తం పెడుతున్నారు. పవన్ సన్నిహితుడు రామ్ తళ్లూరి ఈ సినిమాకు నిర్మాత. ఈ సినిమా ఆర్మీ బ్యాగ్రౌండ్‌లో రాబోతుందనే ప్రచారం జరుగుతుంది. రెగ్యులర్ షూటింగ్ కూడా మార్చి నుంచే మొదలు పెట్టాలనేది పవన్ ఆలోచన. మరోవైపు ఓజి 2 స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు సుజీత్. నానితో సనిమా అవ్వగానే.. పవన్ వైపు రానున్నారీయన. ఈ లోపు సురేందర్ రెడ్డితో సినిమా పూర్తి చేసి.. కుదిర్తే ఈ రెండు సినిమాలు వచ్చే ఎన్నికల్లోపే విడుదల చేయాలనేది పవన్ ప్లాన్. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగానూ బిజీ అవ్వాలని చూస్తున్నారు పవన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి జాయింట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారీయన. మార్షల్ ఆర్ట్స్ వైపూ అడుగులేస్తున్నారు.. వీటితోపాటే పొలిటికల్ బిజీ ఉంటుంది. మరి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ.. వ్యూచర్ సినిమాలను పవన్ ఎలా పూర్తి చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Toxic: టాక్సిక్ విషయంలో రిస్కీ గేమ్ ఆడుతున్న బడా నిర్మాత

Sri Vishnu: శ్రీ విష్ణు కెరీర్‌కు విచిత్రమైన సమస్య.. ఎలా డీల్ చేస్తారో..?

Spirit: ప్రభాస్‌కు సందీప్ రెడ్డి వంగా కండిషన్.. అదే..

Balakrishna: బాలయ్య రెడీ.. ఇక దండయాత్రే బ్యాలెన్స్

ఫిబ్రవరి 15 నుంచి బ్యాంక్‌ రూల్స్‌లో మార్పు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *