టీ20 ప్రపంచ కప్ ఐదో మ్యాచ్‌లో నేపాల్ టీం ఇంగ్లాండ్ జట్టుకు ముచ్చెమటలు పట్టించింది. ఇంగ్లండ్ అందించిన 185 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేజ్ చేసేలా అనిపించింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచం ఈ మ్యాచ్‌పై ఫోకస్ చేసేలా చేసింది. కానీ, చివరి ఓవర్‌లో ఇంగ్లాండ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో నేపాల్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలవ్వాల్సి వచ్చింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. జాకబ్ బెథెల్ 55, హ్యారీ బ్రూక్ 53 పరుగులు చేశారు. నేపాల్ తరపున దీపేంద్ర సింగ్ ఐరీ, నందన్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.