Andhra: అందుకే పవన్‌ను కలవాలనుకుంటున్నా.. ఎమ్మెల్యే శ్రీధర్-వీణ ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్ట్..

Andhra: అందుకే పవన్‌ను కలవాలనుకుంటున్నా.. ఎమ్మెల్యే శ్రీధర్-వీణ ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్ట్..


రోజుకో వీడియో.. పూటకో ట్విస్ట్‌.. ఇలా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కాంట్రవర్సీ కంటిన్యూగా హెడ్‌లైన్స్‌లోకి వస్తోంది. బాధితురాలు హర్ష వీణ వరుసగా.. వీడియోలు, చాటింగ్‌లు విడుదల చేస్తూ.. ఈ ఎపిసోడ్‌లో ఆసక్తికర విషయాలను తెరపైకి తీసుకువస్తున్నారు. అరవ శ్రీధర్‌కు తనతోనే కాదు, మరికొంత మంది అమ్మాయిలతో కూడా సంబంధం ఉందని ఆరోపించారు వీణ.. శ్రీధర్ తనతో అలాగే మరికొంత మంది అమ్మాయిలతో చేసిన చాటింగ్‌లు, కార్ లో రైడింగ్ ఇలా పలు వీడియో బాంబులను పేల్చింది. ఇలాగే మాట్లాడితే తన దగ్గర వెయ్యికి పైగా వీడియో స్క్రీన్ రికార్డ్స్ ఉన్నాయంటూ అరవ శ్రీధర్‌కు వార్నింగ్ కూడా ఇచ్చింది.

ఈ క్రమంలోనే.. హర్ష వీణ మరో వీడియో విడుదల చేసి.. ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన విషయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేసింది.. వ్యక్తిగత అంశాన్ని కావాలనే కొందరు రాజకీయాలు చేస్తున్నారంటూ వీడియోలో చెప్పింది.

వీడియో చూడండి..

ఈ మేరకు అరవ శ్రీధర్‌ బాధితురాలు హర్షవీణ ఆదివారం వీడియో విడుదల చేశారు. తన విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌‌ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని.. వ్యక్తిగత అంశాన్ని కావాలనే కొందరు రాజకీయం చేస్తున్నారని పేర్కొంది.. అవకాశం ఇస్తే ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ ను కలిసి ఆధారాలు ఇస్తానని హర్ష వీణ పేర్కొన్నారు. తనది తప్పని తేలితే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు హర్షవీణ. తన తప్పులేదు కాబట్టే పోరాటం చేస్తున్నానని హర్షవీణ చెప్పుకొచ్చింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *