Toll Plazas: వాహనదారులకు బిగ్ అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్‌.. ఇది తెలుసుకోకపోతే ఇబ్బందులే..!

Toll Plazas: వాహనదారులకు బిగ్ అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్‌.. ఇది తెలుసుకోకపోతే ఇబ్బందులే..!


Toll Plazas: కేంద్ర ప్రభుత్వం టోల్‌ వసూళ్ల విషయంలో సులభతరం చేస్తోంది. వినియోగదారులకు మెరుగ్గా ఉండేందుకు సేవలను మరింత సులభం చేస్తోంది. అయితే టోల్ ప్లాజాల వద్ద రద్దీని దగ్గించేందుకు ఫాస్టాగ్‌ను తీసుకొచ్చింది. దీంతో టోల్‌ ప్లాజాల వద్ద ఆటోమేటిక్‌గా ఛార్జీలు కట్‌ అవుతాయి. అయితే ఈ ఫాస్టాగ్ వచ్చిన తర్వాత కూడా టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు పూర్తిస్థాయిలో తీరకపోవడంతో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం సర్కార్‌.

టోల్‌గేట్ల వద్ద ఫాస్టాగ్‌ ఉన్న వారికి మాత్రమే టోల్‌ వసూలు చేస్తున్నారు. ఇందులో నగదు చెల్లింపులు ఉండవు. అదే ఫాస్టాగ్ లేని వారు లేదా పని చేయని వారు యూపీఐ ద్వారా టోల్‌ చెల్లింపులు చేస్తుంటారు. అయితే ఈ సదుపాయం కూడా లేనివారు క్యాష్ రూపంలో టోల్ రుసుము చెల్లిస్తుంటారు. ఈ సమయంలో ఇక్కడే సమస్య తలెత్తుతుంది. నగదు చెల్లింపుల కారణంగా టోల్‌ ప్లాజాల వద్ద జాప్యం ఏర్పడి మరింత రద్దీ పెరుగుతోంది.

ఇది కూడా చదవండి: టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ బైక్‌లు, స్కూటర్లు.. ధర ఎంతో తెలుసా?

ఇవి కూడా చదవండి

దీని వల్ల ట్రాఫిక్‌ జామ్‌ అయిపోతుంది. ఈ నేపథ్యంలో టోల్ గేట్ల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా రద్దు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటికే కేంద్ర రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాల వద్ద ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

వాటి ద్వారానే టోల్ వసూలు!

టోల్ ప్లాజాల వద్ద ఏప్రిల్ 1వ తేదీ నుంచి నగదు చెల్లింపులు అనేవి ఉండవని కేంద్రం తెలిపింది. వాహనదారులు కేవలం ఫాస్టాగ్, యూపీఐ యాప్‌ల ద్వారానే తమ టోల్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుందని గుర్తించుకోండి. హైవేలపై ఎలాంటి అడ్డంకులూ లేకుండా ప్రయాణం వేగంగా, సాఫీగా సాగేలా ఈ నిర్ణయం తీసుకుంటోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే ఫాస్టాగ్, యూపీఐ లేకుండా కేవలం నగదుతో టోల్‌ప్లాజాల వద్ద ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు. అందుకే వాహనదారులు ముందుగా వాహనదారులు ఇప్పటివరకు ఉన్న ఫాస్టాగ్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫాస్టాగ్ కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి. ఇక ఫాస్టాగ్‌ వాలెట్‌లో కూడా ఎప్పుడు సరిపడ బ్యాలెన్స్‌ను మెయింటెన్‌ చేయడం ముఖ్యం. తగినంత బ్యాలెన్స్‌ లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని గుర్తించుకోండి.

ఇది కూడా చదవండి: Silver Price: భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *