Loan App Fraud: చెప్పకుండానే అకౌంట్లో రూ.29 లక్షలు వేశారు! ఆ తర్వాత అసలు సినిమా మొదలెట్టారు..

Loan App Fraud: చెప్పకుండానే అకౌంట్లో రూ.29 లక్షలు వేశారు! ఆ తర్వాత అసలు సినిమా మొదలెట్టారు..


ఈ మధ్యకాలంలో నకిలీ లోన్‌ యాప్స్‌ ఆగడాలు, వేధింపులు కాస్త తగ్గినట్టు అనిపించినా.. వాటి చేతిలో బలైన వారు చాలా మందే ఉన్నట్లు ఉన్నారు. గతంలో జరిగిన దారుణాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు చెందిన 46 ఏళ్ల ఆయుర్వేద వైద్యుడు నకిలీ లోన్ యాప్ నిర్వాహకుల చేతిలో మోసపోయి ఏకంగా రూ.36.16 లక్షలు పోగొట్టుకున్న ఘటన వెలుగు చూసింది. మోసగాళ్లు అతని మార్ఫింగ్ ఫొటోలను వైరల్‌ చేస్తామని బెదిరించి, అతని నుంచి వడ్డీ రూపంలో రూ.36 లక్షలు లాగేశారు. ఈ సంఘటన 2025 ఆగస్టులో జరిగింది. ఆ డాక్టర్ రెండు లోన్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని మొదట్లో చిన్న చిన్న రుణాలు తీసుకున్నాడు. అయితే లోన్ యాప్ ఆపరేటర్లు డాక్టర్ అనుమతి లేకుండానే పెద్ద మొత్తంలో రుణాన్ని ఆయన ఖాతాలోకి జమ చేశారు.

ఏడు రోజుల్లో రుణం తిరిగి చెల్లించాల్సి ఉందని వైద్యుడు పేర్కొన్నాడు. అయితే ఆరో రోజు నుండి మోసగాళ్ళు అతన్ని బెదిరించడం ప్రారంభించారు. ఇన్‌స్టాలేషన్ సమయంలో లోన్ యాప్ తన కాంటాక్ట్‌లు. ఫోటో గ్యాలరీని యాక్సెస్ చేయమని కోరిందని కూడా అతను ఆరోపించాడు. తన ఫోటోలలో కొన్నింటిని మార్ఫింగ్ చేసి అశ్లీల చిత్రాలతో కలిపి ఉంచారని, పైన పేర్కొన్న మొత్తాన్ని చెల్లించకపోతే ఆ ఫోటోలను తన కాంటాక్ట్‌లకు షేర్ చేస్తామని మోసగాళ్లు బెదిరించారని ఆయన ఆరోపించారు.

ఈ మోసం సెప్టెంబర్ 2025 నుండి ఫిబ్రవరి 2026 వరకు కొనసాగింది. ఈ సమయంలో డాక్టర్ ఖాతాలో రూ.29 లక్షలు వచ్చాయి. వడ్డీతో సహా రూ.64 లక్షలు తిరిగి చెల్లించి రూ.36.16 లక్షలు మోసపోయాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు BNS సెక్షన్లు 318 (4) (మోసం), 319 (2) (నకిలీ ద్వారా మోసం), 338 (ఫోర్జరీ), 340(2) (నకిలీ పత్రాన్ని ఉపయోగించడం), ఐటీ చట్టంలోని సెక్షన్లు 66 (C), 66(D), 67 (A) కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *