Bank Of Baroda Jobs 2026: రూ.లక్షన్నర జీతంతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ ఉద్యోగాలు.. రాత పరీక్షలేదు

Bank Of Baroda Jobs 2026: రూ.లక్షన్నర జీతంతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ ఉద్యోగాలు.. రాత పరీక్షలేదు


బ్యాంక్ ఆఫ్‌ బరోడా దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో రెగ్యులర్‌, ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 49 సీనియర్‌ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, అసిస్టెంట్ వైస్‌ప్రెసిడెంట్‌ పోస్టులను భర్తీ చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు 2026 ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంబీఏ, పీజీడీఎం, సీఏ, సీఎఫ్‌ఏ, సీఎంఏలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి పోస్టులను అనుసరించి 22 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు మూడేళ్లు, పీహెచ్‌ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 26, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్‌ఎం, డీఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులు రూ.175 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఇవి కూడా చదవండి

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *