Ind vs Pak : భారత్-పాక్ మ్యాచ్‌పై హైడ్రామా..ఐసీసీ దెబ్బకు దిగివచ్చిన పాకిస్థాన్

Ind vs Pak : భారత్-పాక్ మ్యాచ్‌పై హైడ్రామా..ఐసీసీ దెబ్బకు దిగివచ్చిన పాకిస్థాన్


Ind vs Pak : టీ20 ప్రపంచకప్ 2026లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చుట్టూ నెలకొన్న నీలినీడలు మెల్లగా తొలగుతున్నాయి. ఫిబ్రవరి 15న జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ పోరును బహిష్కరిస్తామన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, ఇప్పుడు వెనక్కి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ గట్టి హెచ్చరికలు జారీ చేయడంతో, పాక్ బోర్డు దిగివచ్చి చర్చలకు సిద్ధమైంది. క్రికెట్ ప్రపంచమే ఎదురుచూసే ఈ బిగ్ ఫైట్ విషయంలో క్లిష్టమైన మలుపులు చోటుచేసుకున్నాయి.

అసలేం జరిగింది? బహిష్కరణ వెనుక అసలు కథ

బంగ్లాదేశ్‌ను టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం నుంచి తొలగించినందుకు నిరసనగా, పాకిస్థాన్ ప్రభుత్వం ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరించాలని పీసీబీని ఆదేశించింది. దీనిని ఫోర్స్ మజ్యూర్(నియంత్రించలేని పరిస్థితి)గా పేర్కొంటూ పాక్ బోర్డు ఐసీసీకి లేఖ రాసింది. అయితే, ఐసీసీ దీనిని తీవ్రంగా పరిగణించింది. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే తప్ప, అనివార్య కారణం కాదని తేల్చి చెప్పింది. ఒకవేళ పాక్ ఈ మ్యాచ్ ఆడకపోతే, భారీ ఆర్థిక నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని, ఐసీసీ నుంచి వచ్చే నిధులు కూడా నిలిచిపోతాయని హెచ్చరించింది.

ఐసీసీ హెచ్చరిక.. పాక్ దిగివచ్చిన తీరు

ఐసీసీ నుంచి గట్టి సమాధానం రావడంతో పీసీబీ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడింది. కేవలం హెచ్చరికలు మాత్రమే కాదు, ఐసీసీ ఈ విషయంలో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని ప్రతిపాదించింది. దీంతో పీసీబీ తన కఠిన వైఖరిని సడలించి, ఐసీసీతో చర్చలకు సిద్ధమైంది. మ్యాచ్ జరగకపోతే టోర్నీ ఆర్థిక విజయంపై దెబ్బ పడుతుందని, ఇది పాక్ క్రికెట్ భవిష్యత్తుకే ప్రమాదమని గ్రహించిన బోర్డు, ఇప్పుడు ప్రభుత్వం నుంచి కూడా అనుమతి కోరే పనిలో పడింది.

శ్రీలంక రిక్వెస్ట్.. టోర్నీ భవితవ్యం

మరోవైపు, ఈ టోర్నీకి సహ-ఆతిథ్యం ఇస్తున్న శ్రీలంక క్రికెట్ కూడా పాకిస్థాన్‌కు ఒక లేఖ రాసింది. భారత్-పాక్ మ్యాచ్ కోసం లక్షలాది మంది పర్యాటకులు వస్తారని, ఈ మ్యాచ్ రద్దయితే తమ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని విజ్ఞప్తి చేసింది. శ్రీలంక విన్నపాన్ని మన్నిస్తూ, దీనిపై తమ ప్రభుత్వం నుంచి యు-టర్న్ తీసుకునే అవకాశం ఉందని పీసీబీ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు సఫలమైతే, ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా దాయాదుల పోరును మనం మళ్ళీ చూడవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *