Khammam: సంచితో వచ్చాడు.. క్షణాల్లో ఉంగరాల బాక్స్ ఎత్తుకెళ్లిపోయాడు..

Khammam: సంచితో వచ్చాడు.. క్షణాల్లో ఉంగరాల బాక్స్ ఎత్తుకెళ్లిపోయాడు..


ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్‌లోని ఆచారి జ్యుయలరీ షాపులో దొంగ ఒక ఉంగరాల బాక్స్‌ను చోరీ చేసి పారిపోయిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. షాపు యజమాని భోజనం చేసేందుకు లోనికి వెళ్లిన వెంటనే, అదే సమయంలో గుర్తు తెలియని దొంగ షాప్‌లోకి వచ్చి డిస్ ప్లేలో ఉన్న ఉంగరాల బాక్స్‌ను తీసుకొని సంచి వేసి బయటకు పారిపోయాడు. దాంతో, షాపు యజమాని భార్య బాక్స్‌ను ఎత్తుకెళ్తున్నాడని గుర్తించి వెంటనే వెంట పడినా దొంగ అదృశ్యమైపోయాడు. ఈ మొత్తం ఘటన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. సీసీ ఫుటేజీ ఆధారంగా, దొంగ సుమారు సుమారు 6 లక్షలు విలువ చేసే 36 గ్రాముల బంగారు ఉంగరాలు చోరీ చేసి తీసుకెళ్లినట్లు షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రింగ్ రోడ్ సెంటర్‌కి చెందిన ఈ ప్రాంతం నిత్యం జనసంచారం ఎక్కువగా ఉండటంతో, ఈ స్థలంలో క్షణాల్లో జరిగిన చోరీ స్థానికులను షాక్‌కు గురి చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *