Shadley Van Schalkwyk : ఎవడు మమ్మీ వీడు.. 5 బంతుల్లోనే భారత్‌ను ముంచేశాడు..మొత్తానికి వణికించేశాడు

Shadley Van Schalkwyk : ఎవడు మమ్మీ వీడు.. 5 బంతుల్లోనే భారత్‌ను ముంచేశాడు..మొత్తానికి వణికించేశాడు


Shadley Van Schalkwyk : టీ20 ప్రపంచకప్ 2026 ఆరంభ మ్యాచ్‌లో టీమిండియాను వణికించిన బౌలర్ ఎవరా? అని ఇప్పుడు క్రికెట్ లోకం ఆరా తీస్తోంది. వాంఖడే స్టేడియంలో భారత్‌పై అమెరికా ఏకపక్షంగా ఓడిపోతుందని అందరూ ఊహించారు. కానీ ఒక్క ఓవర్‌లో.. కేవలం 5 బంతుల వ్యవధిలో భారత టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఒక బౌలర్. ఆయనే షాడ్లీ వాన్ షాక్విక్. అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా పరిచయం లేని ఈ 37 ఏళ్ల పేసర్, ఇప్పుడు టీమిండియా బ్యాటర్లకు పీడకలగా మారాడు.

ఎవరీ షాడ్లీ వాన్ షాక్విక్?

భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన షాడ్లీ వాన్ షాక్విక్ అసలు సిసలు సౌత్ ఆఫ్రికా వాసి. 1988లో కేప్ టౌన్‌లో జన్మించిన ఆయన, అక్కడే చదువుకుని క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాడు. చాలా మంది భారత క్రికెటర్లు అమెరికాకు వెళ్లి ఆడుతున్నట్టే, షాడ్లీ కూడా మెరుగైన అవకాశాల కోసం అమెరికాకు వలస వెళ్లాడు. 2024 ఏప్రిల్‌లో కెనడాపై టీ20 అరంగేట్రం చేసిన ఈయన, కేవలం కొద్ది నెలల్లోనే తన పేస్ మాయాజాలంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. 37 ఏళ్ల వయసులో కూడా కుర్రాడిలా నిప్పులు చెరిగే బంతులు వేయడం ఆయన ప్రత్యేకత.

ఆ 5 బంతులు.. 3 వికెట్లు.. భారత్ విలవిల

భారత ఇన్నింగ్స్ పవర్‌ప్లే చివరి ఓవర్‌లో (6వ ఓవర్) షాడ్లీ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆ ఓవర్ రెండో బంతికి కుదురుగా ఆడుతున్న ఇషాన్ కిషన్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత అదే ఓవర్ 5వ బంతికి తిలక్ వర్మను, చివరి బంతికి శివం దూబేను పెవిలియన్ పంపాడు. కేవలం 5 బంతుల వ్యవధిలో ముగ్గురు కీలక బ్యాటర్లను అవుట్ చేయడంతో భారత్ 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. డెత్ ఓవర్లలో మళ్లీ వచ్చి అర్ష్‌దీప్ సింగ్‌ను అవుట్ చేయడంతో ఆయన ఖాతాలో మొత్తం 4 వికెట్లు చేరాయి.

అమెరికాకు దొరికిన వజ్రం

షాడ్లీ వాన్ షాక్విక్ కేవలం బౌలర్ మాత్రమే కాదు, లోయర్ ఆర్డర్‌లో మెరుపులు మెరిపించే ఆల్‌రౌండర్ కూడా. భారత్‌పై తన 4 ఓవర్ల స్పెల్‌లో కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. వాంఖడే వంటి బ్యాటింగ్ పిచ్‌పై స్టార్ బ్యాటర్లను కట్టడి చేసిన తీరు చూస్తుంటే, ఈ వరల్డ్ కప్‌లో అమెరికా జట్టు ఇతర పెద్ద జట్లకు కూడా గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడకపోతే షాడ్లీ అమెరికాకు చారిత్రక విజయాన్ని అందించి ఉండేవాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *