Srisailam Brahmotsavam: నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. పూర్తి షెడ్యూల్ ఇదే

Srisailam Brahmotsavam: నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. పూర్తి షెడ్యూల్ ఇదే


Srisailam Brahmotsavam: నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. పూర్తి షెడ్యూల్ ఇదే

శ్రీశైలం, ఫిబ్రవరి 8: ఫిబ్రవరి 13 నుండి భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు. విఐపిలకు ఉదయం 6 మధ్యాహ్నం 12 సాయంత్రం 6 సమయాలలో అలంకార దర్శనం కల్పించనున్నారు. అయితే ఈ ఏడాది ప్రభుత్వం నిర్వహిస్తున్న శ్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ఉండడంతో మహిళ భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బ్రహ్మోత్సవాలకు 40 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతామన్నారు. క్షేత్రంలో పలుచోట్ల వాహనాల పార్కింగ్ సేద తీరేందుకు జర్మన్ షెడ్లు, పార్కింగ్ లో మంచినీరు, మరుగుదొడ్లు, లైటింగ్ అందుబాటులో ఉంచారు. పోయిన ఏడాదిలానే ఈ ఏడాది 13నుండి 16 వరకు 4 రోజులు భక్తులకు ఉచిత లడ్డు అలానే 15,16 న రెండు రోజులు వాహనాలు టోల్ గేట్లు లేకుండా ఉచితంగా అనుమతించనున్నారు.

పాదయాత్రగా అటవీ మార్గంలో వచ్చే భక్తులకు భీముని కొలను కైలాసద్వారం నుండి పలుచోట్ల స్వచ్ఛంద సంస్థలచే అన్నదానం, మెడికల్ క్యాంపులు, మంచినీరు, సేద తీరేందుకు షెడ్లు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఉచిత దర్శనం ప్రత్యేక దర్శనం క్యూలైన్లులో వేచి వుండే భక్తులకు ప్రతినిత్యం మంచినీరు, పాలు, అల్పాహారం ఏర్పాటు చేయనున్నారు. పాతాళగంగలో భక్తులకు భద్రత ఘాట్ లలో గజఈతగాళ్ళు అటవీ మార్గం నుండి శ్రీశైల క్షేత్రంలో పలుచోట్ల జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశారు. భక్తుల సేద తీరేందుకు ఈ రోజు శ్రీస్వామివారి యాగశాల ప్రవేశంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు రేపటి నుండి శ్రీస్వామి అమ్మవార్లకు వివిధ వాహనసేవలు, గ్రామోత్సవం జరగనున్నాయి.

అలానే రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల నుంచి బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు ఈనెల 12న రాష్ట్ర ప్రభుత్వంచే పట్టు వస్త్రాలు అందించనున్నారు. ఇప్పటికే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మంత్రుల ఆనం నారాయణరెడ్డి వంగలపూడి అనిత బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పర్యటన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ, ఎస్పీ సునీల్ శరన్ ఆధ్వర్యంలో రెండుసార్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. 3 వేల మంది పోలీసులతో భద్రత, డ్రోన్ కెమెరాలతో నిఘా, అలానే ఇతర శాఖలకు సంబంధించి సుమారు 2 వేల మంది సిబ్బందితో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతం చేస్తామని చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ముఖ్య కార్యక్రమాలు ఇలా..

  • ఈరోజు ఉదయం శ్రీస్వామివారి యాగశాల ప్రవేశ, సాయంత్రం ధ్వజారోహణం శ్రీకాళహస్తి దేవస్థానంచే పట్టువస్త్రాలు
  • 9న బృంగివాహనసేవ ద్వారకా తిరుమలచే పట్టువస్త్రాలు
  • 10న హంసవాహనసేవ విజయవాడ దుర్గమ్మ ఆలయంచే పట్టు వస్త్రాలు
  • 11వ మయూరవాహనం ఉదయం కాణిపాకం సాయంత్రం టీటీడీ ఆలయంచే పట్టువస్త్రాలు
  • 12న రావణ వాహన సేవ ఏపీ ప్రభుత్వం తరుపున శ్రీస్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు
  • 13న శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్ప పల్లకి సేవ
  • 14న గజవాహన సేవ
  • 15న మహాశివరాత్రి సందర్భంగా ప్రభోత్సవం,నందివాహనసేవ శ్రీస్వామివారికి లింగోద్భవకాల మహా రుద్రాభిషేకం,పాగలంకరణ రాత్రి బ్రహ్మోత్సవ కళ్యాణం
  • 16న సాయంత్రం రథోత్సవం రాత్రి తెప్పోత్సవం
  • 17న ధ్వజావరోహణం
  • 18న అశ్వవాహనసేవ పుష్పోస్తవం, శయనోత్సవంతో ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపు

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *