PM Modi Malaysia: మలేషియాకు బయలుదేరిన ప్రధాని మోదీ.. ఈ పర్యటన భారత్‌కు ఎందుకు ప్రత్యేకమైనదో తెలుసా?

PM Modi Malaysia: మలేషియాకు బయలుదేరిన ప్రధాని మోదీ.. ఈ పర్యటన భారత్‌కు ఎందుకు ప్రత్యేకమైనదో తెలుసా?


భారతదేశం-మలేషియా సంబంధాలను కొత్త శిఖరాలకు చేర్చే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం శనివారం (ఫిబ్రవరి 07) మలేషియాకు బయలుదేరారు . పర్యటనకు ముందు, రక్షణ, భద్రత, ఆర్థిక వ్యవస్థ, ఇన్నోవేటివ్ వంటి కీలక రంగాలలో మలేషియాతో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని భారతదేశం కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ పేర్కోన్నారు.

బయలుదేరే ముందు, ప్రధానమంత్రి మోదీ భారతదేశం- మలేషియా మధ్య చారిత్రాత్మక సంబంధం ఉందని, ఇది సంవత్సరాలుగా క్రమంగా బలపడుతోందని పేర్కొన్నారు. మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో వివరణాత్మక చర్చల కోసం ఆయన తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. రక్షణ – భద్రతా సహకారంతో పాటు వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, ఆవిష్కరణలకు కొత్త దిశలతో సహా రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి పెడతామని ప్రధాని మోదీ అన్నారు.

మలేషియాలోని భారతీయ సమాజం ప్రధాని మోదీ పర్యటన పట్ల ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ప్రధాని మోదీకి స్వాగతించడానికి కౌలాలంపూర్‌లో “వెల్‌కమ్ మోడీ జీ” అనే పేరుతో ఒక గ్రాండ్ కమ్యూనిటీ ఈవెంట్ ఏర్పాటు చేశారు. 750 మందికి పైగా కళాకారులు కలిసి ఒకే వేదికపై ప్రదర్శనలు ఇవ్వబోతున్నారు. ఈ కార్యక్రమం మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు కావచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ రికార్డు కోసం ఇప్పటికే దరఖాస్తు సమర్పించారు. ఇది ప్రధాని మోదీ మలేషియాలో చేసిన మూడవ పర్యటన. ఆగస్టు 2024లో భారతదేశం-మలేషియా సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఎదిగిన తర్వాత ఆయన తొలిసారిగా ఈ పర్యటనకు వస్తున్నారు.

ఈ పర్యటన సందర్భంగా, రెండు దేశాలు తమ భవిష్యత్ రోడ్ మ్యాప్ గురించి నిర్దిష్ట నిర్ణయాలు తీసుకోవచ్చని భావిస్తున్నారు. మొత్తంమీద, ప్రధాని మోదీ పర్యటన కేవలం స్వాగతం, వేడుకకే పరిమితం కాకుండా, భారతదేశం – మలేషియా మధ్య వ్యూహాత్మక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన అడుగుగా మారబోతుంది. “వెల్‌కమ్ మోదీ జీ” కార్యక్రమానికి దాదాపు 15,000 మంది భారత సంతతికి చెందిన వారు హాజరవుతారని భారత హైకమిషన్ తెలిపింది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద, మూడవ పురాతన భారతీయ సంతతి సమాజానికి మలేషియా నిలయం. అందుకే ప్రధాని మోదీ పర్యటన దౌత్యపరంగానే కాకుండా భావోద్వేగపరంగా కూడా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *