Rose Day: వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది.. ఏ కలర్ గులాబీ ఎవరికి ఇవ్వాలో తెలుసా..?

Rose Day: వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది.. ఏ కలర్ గులాబీ ఎవరికి ఇవ్వాలో తెలుసా..?


ప్రేమకు భాష లేదు.. కానీ భావం ఉంది. ఆ భావాన్ని వ్యక్తపరచడానికి మాటల కంటే పూలే శక్తివంతమైనవి. అందుకే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న వచ్చే వాలెంటైన్స్ డేకి వారం ముందే ప్రేమికుల సందడి మొదలవుతుంది. ఇవాళ రోజ్ డేతో లవ్ వీక్ మొదలైంది. వాలెంటైన్స్ వీక్ ఎందుకు గులాబీతోనే మొదలవుతుందనే దానికి అధికారికంగా ఆధారాలు లేకపోయినా, ప్రాచీన కాలం నుండి రోమన్లు గులాబీని ప్రేమకు చిహ్నంగా భావించేవారు. విక్టోరియన్ కాలంలో తమ మనసులోని మాటను నేరుగా చెప్పలేక, రంగు రంగుల గులాబీల ద్వారా సందేశాలను పంపేవారు. 20వ శతాబ్దం చివరలో ఈ రోజ్ డే సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా ఒక వేడుకగా మారింది. తమ భాగస్వామికి లేదా ఇష్టమైన వారికి గులాబీలు ఇవ్వడం వల్ల బంధం మరింత బలపడుతుందని ప్రేమికుల నమ్మకం.

ఏ రంగు గులాబీ.. ఏ సందేశం ఇస్తుంది?

చాలామంది అందంగా ఉందని ఏదో ఒక గులాబీని ఇచ్చేస్తుంటారు. కానీ ప్రతి రంగుకు ఒక ప్రత్యేక అర్థం ఉంది. మీరు ఎవరికి ఇస్తున్నారో దాన్ని బట్టి రంగును ఎంచుకోవడం ముఖ్యం..

ఎర్ర గులాబీ: ఇది గాఢమైన ప్రేమకు, అభిరుచికి చిహ్నం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మనసులోని మాటను చెప్పడానికి ఇది సరైన ఎంపిక.

పసుపు గులాబీ: ఇది స్వచ్ఛమైన స్నేహానికి గుర్తు. ప్రేమ ఒత్తిడి లేకుండా స్నేహితుల మధ్య ఆనందాన్ని పంచుకోవడానికి పసుపు గులాబీ ఇస్తారు.

తెల్ల గులాబీ: శాంతి, స్వచ్ఛత, కొత్త ప్రారంభానికి ఇది సంకేతం. అపార్థాల తర్వాత మళ్లీ ఒక్కటవ్వాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

గులాబీ రంగు : ఇది కృతజ్ఞతకు, సున్నితమైన ఆప్యాయతకు గుర్తు. మన జీవితంలో ఉన్నందుకు కృతజ్ఞత తెలుపుతూ మనకు ఇష్టమైన వారికి దీనిని ఇవ్వవచ్చు.

వాలంటైన్ వీక్ షెడ్యూల్

నేటి రోజ్ డే నుండి ఫిబ్రవరి 14 వరకు వరుసగా ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే.. ఇలా ప్రతిరోజూ ఒక ప్రత్యేకతతో వాలెంటైన్స్ వీక్ కొనసాగుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *