ఆ హీరో మామూలోడు కాదు.. అతని సత్తా ఏంటో అప్పుడే తెలిసింది.. హర్షవర్ధన్ కామెంట్స్

ఆ హీరో మామూలోడు కాదు.. అతని సత్తా ఏంటో అప్పుడే తెలిసింది.. హర్షవర్ధన్ కామెంట్స్


నటుడిగా రచయితగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు హర్షవర్ధన్. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశాంకురవరప్రసాద్ గారు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు హర్షవర్ధన్.. ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశాంకురవరప్రసాద్ గారు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు హర్షవర్ధన్. సీనియర్‌లు తమ విజయ గాథలను మాత్రమే పంచుకోవడమే కాకుండా, తాము చేసిన తప్పులు, వైఫల్యాల గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉందని హర్షవర్ధన్ అన్నారు. స్టార్ డమ్ ఉన్నవారు కూడా తమ తప్పులను పంచుకుంటే అది పరువుకు భంగం కాదని, కొత్తవారికి, కష్టపడుతున్న కళాకారులకు తాము కూడా సాధారణ మనుషులమే అని అర్థమవుతుందని అన్నారు.

రాబోయే తరం సినిమా దర్శకనిర్మాతలకు దర్శకుడు రామ్ జగదీష్ లాంటి వారి అనుభవాలు, ఏం చేయకూడదు, ఏం చేయాలి వంటి విషయాలపై పాడ్‌కాస్ట్‌లు చేయాలని హర్షవర్ధన్ అన్నారు. అలాగే నాని నిర్మాతగా వ్యవహరించిన కోర్టు సినిమా అనూహ్య విజయం సాధించిన తీరును ప్రస్తావిస్తూ, నాని దూరదృష్టి, రామ్ జగదీష్ సత్తా అద్భుతంగా పనిచేశాయని హర్షవర్ధన్ ప్రశంసించారు. కోర్ట్ సినిమా ఓ మాదిరి హిట్ అవుతుందని అనుకున్నా.. కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు.. అక్కడే నాని సత్తా ఏంటో తెలిసింది. అతని విజన్ ఏంటో తెలిసిపోయింది అని హర్షవర్ధన్ అన్నారు. నాని  సరైన నిర్ణయాలు సినిమాకు గొప్ప విజయాన్ని తెచ్చాయని ఆయన పేర్కొన్నారు.

అలాగే తన గురించి మరిన్ని విషయాలు పంచుకుంటూ.. నటుడు కావడానికి ముందు తాను సంగీతకారుడు కావాలనుకున్నానని, అయితే తనకు చిన్నప్పటి నుంచీ రచనపై అమితమైన ఆసక్తి ఉండేదని హర్షవర్ధన్ తెలిపారు. రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారి రచనలకు తాను బానిసనయ్యానని గుర్తుచేసుకున్నారు. ఒక పుస్తకాన్ని ఎంచుకునేటప్పుడు, మొదటి పది పేజీలు చదివితే అది నచ్చుతుందా లేదా అనేది అర్థమవుతుందని అన్నారు హర్షవర్ధన్.

ఇవి కూడా చదవండి

Nani

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *