AA22: బన్నీ కోసం రూటు మారుస్తున్న రష్మిక..

AA22: బన్నీ కోసం రూటు మారుస్తున్న రష్మిక..


పుష్పా 2 తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం AA22. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రతి అప్‌డేట్ అంచనాలను పెంచుతోంది. ఎక్కువ భాగం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ సంబంధించి మేకర్స్ కొత్త వివరాలను వెల్లడించారు. AA22 చిత్రం గ్లోబల్ స్థాయిలో బజ్‌ను సృష్టిస్తోంది. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ముంబైలో రష్మిక మందన్న సోలో సీన్లు చిత్రీకరిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రష్మిక నెగటివ్ రోల్‌లో నటిస్తున్నారని, ఆమె పాత్ర ప్రేక్షకులని ఆశ్చర్యపరుస్తుందని ప్రచారం జరుగుతోంది. తదుపరి షెడ్యూల్‌లో అల్లు అర్జున్ మరియు జాన్వి కపూర్ కాంబినేషన్ సీన్స్ షూటింగ్ చేయనున్నారు. పార్లల్ వరల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. పుష్ప సినిమాతో ఇండియన్ మార్కెట్‌ను ఆకట్టుకున్న ఐకాన్ స్టార్, AA22తో గ్లోబల్ స్థాయిలో తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Peddi: పెద్ది’ కొత్త డేట్ వెనక పెద్ద కథే ఉందిగా

చిన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఫిబ్రవరి 6

టాలీవుడ్‌లో క్రేజ్ కోసం హీరోయిన్ల తిప్పలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ డేట్‌తో అక్కడ మొదలైన కంగారు

Varanasi: వారణాసి లీక్స్.. టెన్షన్‌లో ఓపెన్ అయ్యారా



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *