Wealth Yoga: అరుదైన చంద్ర మంగళ యోగం.. జాక్ పాట్ కొట్టబోయే రాశులివే..!

Wealth Yoga: అరుదైన చంద్ర మంగళ యోగం.. జాక్ పాట్ కొట్టబోయే రాశులివే..!


ఫిబ్రవరి 8, 9, 10 తేదీల్లో తులా రాశిలో చంద్ర సంచారం సమయంలో అరుదైన చంద్ర మంగళ యోగం ఏర్పడుతోంది. ఈ మహా భాగ్య యోగ ప్రభావంతో మేషం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి ఆదాయ వృద్ధి, ఆకస్మిక ధనలాభాలు, పదోన్నతులు వంటి రాజయోగాలు కలగనున్నాయి.

  1. మేషం: ఈ రాశికి సప్తమ స్థానంలో చంద్రుడు, దశమ స్థానంలో ఉచ్ఛ కుజుడి స్థితి వల్ల చంద్ర మంగళ యోగం కలిగింది. దీనివల్ల ఉద్యోగపరంగా విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలగడంతోపాటు, వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. ఆస్తి వివాదాలు తేలికగా పరిష్కారమవుతాయి. విలువైన ఆస్తి కలిసి వస్తుంది. భూలాభం కలుగుతుంది.
  2. కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడు చతుర్థ స్థానంలో, కుజుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఈ విశిష్టమైన యోగం కలిగింది. దీనివల్ల అనేక మార్గాల్లో సంపద వృద్ధి చెందుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. ఆదాయ వృద్ది కోసం ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు వరిస్తాయి. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభించి జీతభత్యాలు పెరగడం, పదోన్నతి లభించడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
  3. తుల: ఈ రాశిలో చంద్రుడు, చతుర్థ స్థానంలో ఉచ్ఛ కుజుడి సంచారం వల్ల ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై, ఆస్తి లాభం, భూలాభం కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు భారీ జీత భత్యాలతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు బాగా అనుకూలంగా మారతాయి. అనుకోకుండా గృహ, వాహన యోగాలు కలుగుతాయి.
  4. ధనుస్సు: ధన స్థానంలో ఉన్న కుజుడు, లాభ స్థానంలో ఉన్న చంద్రుడు పరస్పర కేంద్రాల్లో ఉన్నందువల్ల ఈ యోగం కలిగింది. ఈ రాశివారి ఆదాయ వృద్ధికి అనేక అవకాశాలు అంది వస్తాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ఆదాయ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. ధన ధాన్య సమృద్ధికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
  5. మకరం: ఈ రాశిలో ఉన్న ఉచ్ఛ కుజుడు, దశమ స్థానంలో ఉన్న చంద్రుడు పరస్పరం కేంద్ర స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయం అయ్యే అవకాశం ఉంటుంది. ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనుకోకుండా ఆస్తిపాస్తులు కలిసి రావడం జరుగుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *