గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో భారీ ఊరట

గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో భారీ ఊరట


తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. గ్రూప్-1 నియామక ప్రక్రియపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం రద్దు చేస్తూ గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్-1 నియామకాలకు సంబంధించి విడుదల చేసిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును గతంలో సింగిల్ జడ్జి రద్దు చేశారు. అభ్యర్థుల మెయిన్స్ జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాలని ఆదేశించారు. దీనివల్ల ఎంపికైన అభ్యర్థుల భవితవ్యంపై నీలినీడలు ముసురుకున్నాయి. సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ మరియు ఎంపికైన అభ్యర్థులు హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సమగ్ర విచారణ జరిపిన సీజే ధర్మాసనం, సింగిల్ జడ్జి నిర్ణయం సరైనది కాదని అభిప్రాయపడుతూ దానిని కొట్టివేసింది. పునఃమూల్యాంకనం అవసరం లేదని స్పష్టం చేయడంతో ఎంపికైన అభ్యర్థులకు లైన్ క్లియర్ అయ్యింది. చాలా కాలంగా న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న ఈ నియామక ప్రక్రియకు తాజా తీర్పుతో ఒక కొలిక్కి వచ్చినట్లయింది. పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే తుది నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లిఫ్ట్‌లో గ్యాస్ బెలూన్లు తీసుకెళ్తున్న డెలివరీ బోయ్‌.. అంతలోనే.. ఇలా జరుగుతుందని అనుకోలేదు

TTD: అర్చకులకు టీటీడీ శిక్షణ ప్రారంభం

ఒక్కో ఊరిలో హడలెత్తిస్తున్న ఒక్కో పులి.. ఇక ప్రజలు ఉండేది ఎలా

పుష్కరానికోసారి పూసే అరుదైన పుష్పం.. చూడాలంటే అదృష్టం ఉండాలి

భూమి కింద మిస్సైల్ బేస్‌.. ప్రపంచానికి చాటిన’ఇరాన్’



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *