
ఐదుసార్లు ఛాంపియన్స్ గా నిలిచిన భారత్.. 1998 విజేత ఇంగ్లాండ్ మధ్య ఈరోజు అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ జరుగుతోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత జట్టుకు తొలి ఎదురు దెబ్బ తగిలినా.. వైభవ్ సూర్యవంశీ, ఆయూష్ మాత్రేలు భారత జట్టును ఆదుకున్నారు. వార్త రాసే సమాయానికి వీరిద్దరు 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 79 పరుగులకు తీసుకెళ్లారు. చేసింది. వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే అర్ధ సెంచరీ భాగస్వామ్యంతో క్రీజులో ఉన్నారు. తొమ్మిది పరుగుల వద్ద ఆరోన్ అవుట్ అయ్యాడు.
వైభవ్ హాఫ్ సెంచరీ..
ఆది నుంచి దూకుడుగా కనిపించిన వైభవ్ సూర్యవంశీ.. బౌండరీలతో డీల్ చేస్తున్నాడు. తొలుత ఆడితూచి ఆడిన వైభవ్ కేవలం 32 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్ లతో హాఫ్ సెంచరీ బాదేశాడు. అయితే, అభిమానులు మాత్రం సెంచరీతో చెలరేగాలని కోరుకుంటున్నారు.