Cow care: పాడి రైతు.. ఈ ఆవు కాలిపై బాటిల్ ఎందుకు కట్టాడో తెలుసా?

Cow care: పాడి రైతు.. ఈ ఆవు కాలిపై బాటిల్ ఎందుకు కట్టాడో తెలుసా?


ఈ రైతు తెలివి చూశారా.. మెత్తడి మ్యాట్ కొనే స్థోమత లేకపోవడంతో.. ఆవు ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ పనికి పూనుకున్నాడు. అందుకే అందరూ అంటారు అవసరం ఆవిష్కరణకు తల్లి లాంటిది అని. సాధారణంగా ఆవు కాలిపై గాయాలున్నప్పుడు.. అవి అటు వైపే కూర్చుంటే..  ఆ గాయాలు మరింత తీవ్రమయ్యే.. ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. ఇది ఆవుకు నొప్పిని కలిగించడమే కాకుండా, దాని ఆరోగ్యంపై, ముఖ్యంగా పాల ఉత్పత్తి సామర్థ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. గాయాలు ఎక్కువ కావడంతో పాలు తగ్గడం జరుగుతుంది. ఈ సమస్యను నివారించడానికి, రైతు ఆవు కాలిపై ఒక బాటిల్‌ను కట్టాడు. ఈ బాటిల్ కూర్చునే సమయంలో శబ్దం చేస్తుంది. ఈ శబ్దం ఆవును హెచ్చరిస్తుంది. అంతేకాదు బాటిల్ కారణంగా అటువైపు కూర్చోడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. దీంతో గాయం లేని వైపు నిలబడి ఆవు కూర్చుంటుంది. దీనివల్ల గాయాలపై ఒత్తిడి తగ్గి, అవి త్వరగా నయం కావడానికి అవకాశం ఉంటుంది. ఈ సాధారణ పద్ధతి ద్వారా గాయాల తీవ్రతను తగ్గించి, ఆవు ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. ఫలితంగా, పాలశక్తిని తగ్గకుండా కాపాడుకోవచ్చు, తద్వారా పాడి రైతులు మెరుగైన ఉత్పత్తిని కొనసాగించవచ్చు. ఇది పశువుల సంరక్షణలో ఓ సులభమైన, తెలివైన పరిష్కారం.

అయితే ఈ వీడియోలో ఆ రైతు బాటిల్‌ను చాలా బిగుతుగా కట్టాడు. అలా కట్టకూడదు. రక్త ప్రసరణ ఆగకుండా జాగ్రత్త పడాలి. నూలు తాడు బదులు సాఫ్ట్ క్లాత్ స్ట్రిప్ వాడితే మంచిది. గాయాలున్న పశువుకు తడి నేల పెద్ద శత్రువు.. అందుకే కింద ఎండు గడ్డి.. పాత గోనె సంచులు వేస్తే మంచింది. ప్లాస్టిక్ బాటిల్ ఐడియా బాగానే ఉంది. కానీ షార్ప్ ఎడ్జెస్ లేకుండా కట్ చేసి, టేప్ చుట్టి పెడితే వాటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *