T20 World Cup: టీ20 ప్రపంచకప్ హిస్టరీలో ఎప్పటికీ బద్దలవ్వని 3 రికార్డులు.. లిస్ట్‌లో టీమిండియా ప్లేయర్ కూడా..?

T20 World Cup: టీ20 ప్రపంచకప్ హిస్టరీలో ఎప్పటికీ బద్దలవ్వని 3 రికార్డులు.. లిస్ట్‌లో టీమిండియా ప్లేయర్ కూడా..?


T20 World Cup Records: ఫిబ్రవరి 7 నుంచి 2026 టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ ఐసీసీ మెగా టోర్నమెంట్ పై నిలిచింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ హిస్టరీని గుర్తుచేసుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా రికార్డుల గురించి మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో పంచుకున్నారు. వాటిలో కొన్ని రికార్డులు అయితే ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉంటాయని చెబుతున్నారు. ఈ పోట్టి ఫార్మాట్ లో ఒక్క ఇన్నింగ్స్, ఒక చిన్న స్పెల్, లేదా కేవలం ఒకే ఒక్క ఓవర్ కూడా రికార్డు పుస్తకాలను శాశ్వతంగా మార్చేయగలవనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీ20ఐ ప్రపంచకప్ హిస్టరీలో ఎప్పటికీ బద్దలవ్వని రికార్డులను ఓసారి చూద్దాం..

3. 172 పరుగుల తేడాతో విక్టరీ..(Sri Lanka 172-run victory vs Kenya, 2007)

తొలి ఐసీసీ టీ20ఐ ప్రపంచకప్ 2007లో జరిగింది. ఈ సమయంలో శ్రీలంక జట్టు కెన్యాపై 172 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. టీ20 చరిత్రలోనే అత్యంత ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి. సరికొత్త రికార్డ్ క్రియోట్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 6 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. ఈమ్యాచ్ లో సనత్ జయసూర్య 44 బంతుల్లో 88 పరుగులతో విశ్వరూపం చూపించగా, మహేల జయవర్ధనే కేవలం 27 బంతుల్లో 65 పరుగులు సాధించాడు. చివర్లో జెహాన్ ముబారక్ 13 బంతుల్లోనే 46 పరుగులు చేసి స్కోరును మరింత పెంచాడు. అనంతరం లక్ష్య ఛేదనలో కెన్యా జట్టు శ్రీలంక బౌలర్ల ధాటికి తట్టుకోలేక 88 పరుగులకే కుప్పకూలింది. చమిందా వాస్, లసిత్ మలింగ, తిలకరత్నే దిల్షాన్ తలో రెండు వికెట్లు తీశారు.

ఈ రికార్డును తిరగరాయడం దాదాపు అసాధ్యం అనడానికి ప్రధాన కారణం ఆనాటి పరిస్థితులు. అప్పట్లో అగ్రశ్రేణి జట్లకు, అసోసియేట్ జట్లకు మధ్య చాలా వ్యత్యాసం ఉండేది. కానీ, నేడు అసోసియేట్ జట్లు ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతూ, మెరుగైన శిక్షణతో వ్యూహాత్మకంగా చాలా బలంగా తయారయ్యాయి.

2. యువరాజ్ సింగ్ 6 సిక్స్ లు (Yuvraj Singh’s 12-ball fifty, 2007)

ఇక మరో రికార్డ్ గురించి చెప్పాలంటే అదే సంవత్సరం అంటే 2007లో జరిగిన టీ20ఐ ప్రపంచకప్ లెక్కలు మరోసారి చూడాల్సింది. ఈ రికార్డ్ క్రియో చేసింది ఎవరో కాదు, టీమిండియా స్టైలీష్ ప్లేయర్ యువరాజ్ సింగ్. డర్బన్ వేదికగా టీ20 ప్రపంచకప్ హిస్టరీలో భారీ రికార్డ్ నమోదు చేశాడు. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే స్పష్టమైన ఉద్దేశంతో ఆడిన యువరాజ్, కేవలం 12 బంతుల్లోనే తన అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. దాదాపు రెండు దశాబ్దాలు గడుస్తున్నా ఈ రికార్డు నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒకే ఓవర్‌లో వరుసగా 6 సిక్సర్లు బాదడం ఈ ఇన్నింగ్స్‌ను క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిపివేసింది.

యువరాజ్ కేవలం 16 బంతుల్లో 7 సిక్సర్లతో 58 పరుగులు చేయడంతో భారత్ 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌కు ముందు యువరాజ్, ఆండ్రూ ఫ్లింటాఫ్ మధ్య జరిగిన మాటల యుద్ధం ఈ మ్యాచ్‌కు మరింత హీట్ తెచ్చిపెట్టింది. గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ అందించిన శుభారంభంతో భారత్ చివరకు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. కేవలం 12 బంతుల్లో 50 పరుగులు చేయాలంటే అద్భుతమైన హిట్టింగ్ ఉంటే సరిపోదు, బౌలర్ల వ్యూహం కూడా పూర్తిగా అర్థం చేసుకోవాలి.

1. లాకీ ఫెర్గూసన్ 4 మెయిడీన్ ఓవర్లు (Lockie Ferguson 4 maiden overs, 2024)

టీ20 క్రికెట్ అంటేనే పరుగుల వరద, భారీ సిక్సర్లు అని అందరూ అనుకుంటారు. కానీ, వీటికి భిన్నంగా న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గూసన్ 2024 టీ20 ప్రపంచ కప్‌లో పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో ఒక అసాధ్యమైన రికార్డును నెలకొల్పాడు. తన కోటాలోని 4 ఓవర్లను వరుసగా మెయిడిన్లుగా వేసి, 4-4-0-3 ఆశ్చర్యపరిచాడు. అలాగే అసద్ వాలా, చార్లెస్ అమినీ, చాద్ సోపర్ల వికెట్లను పడగొట్టిన ఫెర్గూసన్, ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మ్యాచ్ ముగించాడు. 2021లో పనామాపై కెనడా బౌలర్ సాద్ బిన్ జఫర్ (4-4-0-2) నెలకొల్పిన రికార్డును ఫెర్గూసన్ ఈ ప్రదర్శనతో అధిగమించాడు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇలా నాలుగు ఓవర్లు వేసి ఒక్క పరుగు కూడా ఇవ్వని తొలి బౌలర్‌గా అతను చరిత్ర సృష్టించాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *