Abhishek Sharma : వార్మప్ మ్యాచులో అభిషేక్ శర్మ మధ్యలోనే ఎందుకు వెనుదిరిగాడు? రిటైర్డ్ అవుట్ వెనుక మర్మమేంటి?

Abhishek Sharma : వార్మప్ మ్యాచులో అభిషేక్ శర్మ మధ్యలోనే ఎందుకు వెనుదిరిగాడు? రిటైర్డ్ అవుట్ వెనుక మర్మమేంటి?


Abhishek Sharma : టీ20 వరల్డ్ కప్ 2026 సమరం మొదలవ్వకముందే టీమిండియా తన పదును చూపిస్తోంది. ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి సౌతాఫ్రికాతో జరిగిన ఏకైక వార్మప్ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో యువ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 వేటను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. సౌతాఫ్రికాతో జరిగిన ఏకైక వార్మప్ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా జట్టును 210 పరుగులకే కట్టడి చేసి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ఫలితం కంటే కూడా భారత ఓపెనర్ల ప్రదర్శన, వారు తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.

భారత ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇషాన్ కిషన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 20 బంతుల్లోనే 2 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేసి హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. అయితే తను మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ, జట్టులోని ఇతర ఆటగాళ్లకు కూడా ప్రాక్టీస్ లభించాలనే ఉద్దేశంతో 5.4 ఓవర్ల వద్దే రిటైర్డ్ అవుట్‎గా వెనుదిరిగాడు. సాధారణంగా వార్మప్ మ్యాచ్‌లలో బ్యాటర్లు తమ ప్రాక్టీస్ పూర్తయినట్లు భావిస్తే ఇతరులకు అవకాశం ఇచ్చేందుకు ఇలా చేస్తారు. ఇషాన్ ఇన్నింగ్స్ చూస్తుంటే వరల్డ్ కప్‌లో అతను సృష్టించబోయే విధ్వంసం ఎలా ఉండబోతుందో క్లియర్‌గా అర్థమవుతోంది.

అభిషేక్ శర్మకు ఏమైంది? 18 బంతుల్లో 24 పరుగులేనా?

మరోవైపు, పవర్ హిట్టర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో కాస్త తడబడ్డాడు. సాధారణంగా తొలి బంతి నుంచే విరుచుకుపడే అభిషేక్, ఈ మ్యాచ్‌లో బంతిని సరిగ్గా టైమ్ చేయలేకపోయాడు. ఒకవైపు ఇషాన్ కిషన్ బౌలర్లను చీల్చిచెండాడుతుంటే, అభిషేక్ మాత్రం పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డాడు. కేవలం 18 బంతుల్లో 24 పరుగులు (3 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే చేసిన తర్వాత, తను అనవసరంగా బంతులను వృధా చేస్తున్నానని భావించిన అభిషేక్ శర్మ, పెవిలియన్ వైపు అడుగులు వేశాడు. తన వల్ల మిగతా బ్యాటర్లకు సమయం తక్కువ కాకూడదనే ఉద్దేశంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు.

రిటైర్డ్ అవుట్ వెనుక అసలు మాస్టర్ ప్లాన్

వార్మప్ మ్యాచ్‌లలో ఒక ఆటగాడు రిటైర్డ్ అవుట్ లేదా రిటైర్డ్ హర్ట్ అవ్వడం వెనుక టీమ్ మేనేజ్‌మెంట్ ప్లాన్ ఉంటుంది. భారత్ ఈ మ్యాచ్‌లో గెలుపు కంటే కూడా టాప్-6 బ్యాటర్లు అందరూ క్రీజులోకి వెళ్లి పిచ్‌ను అర్థం చేసుకోవాలని భావించింది. అందుకే ఇషాన్, అభిషేక్ త్వరగా వెనుదిరగడంతో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వంటి వారికి కూడా తగినంత సమయం లభించింది. సౌతాఫ్రికా బౌలర్లను భారత బ్యాటర్లు ఉతికి ఆరేసిన తీరు చూస్తుంటే, ఈసారి వరల్డ్ కప్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందని స్పష్టమవుతోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *