Headlines

వయసు పెరిగిందనుంటే పొరపాటే.. పట్టపగలే చుక్కలు చూపించే హార్డ్ హిట్టర్లు.. మెగా ఈవెంట్ బరిలో ఐదుగురు..!

వయసు పెరిగిందనుంటే పొరపాటే.. పట్టపగలే చుక్కలు చూపించే హార్డ్ హిట్టర్లు.. మెగా ఈవెంట్ బరిలో ఐదుగురు..!


Top 5 Oldest Players played in t20 world cup 2026: వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య అని అప్పుడప్పుడు నిరూపితమవుతూనే ఉంటుంది. ముఖ్యంగా క్రికట్ లో ఇది తప్పని తేలుతూనే ఉంది. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2026లో కొందరు ప్లేయర్లు తమ వయసుతో సంచలనంగా మారారు. టీ20 ఫార్మాట్‌ అంటే యువ ఆటగాళ్ల దూకుడు అనే నానుడికి, ఈ సీనియర్ ప్లేయర్లు కూడా తమ సత్తా చాటుతూ ఆకట్టుకుంటున్నారు. 40 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల ఐదుగురు స్టార్లు తమ అనుభవంతో సంచలనంగా మారారు. టీ20 ప్రపంచ కప్ 2026లో ఆడుతున్న టాప్ ఐదుగురు సీనియర్ ప్లేయర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మొహమ్మద్ నదీమ్: 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఆడనున్న అతి పెద్ద వయసు ఆటగాళ్ల జాబితాలో మహ్మద్ నదీమ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఓమన్‌ ఆల్ రౌండర్ నదీమ్ వయసు 43 సంవత్సరాలు. అతను 70 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడి 768 పరుగులు చేసి 40 వికెట్లు పడగొట్టాడు.

ఇది కూడా చదవండి: Team India: అభిషేక్, సూర్య కాదు భయ్యో.. టీ20 ప్రపంచకప్ లో విదేశీ బౌలర్ల పాలిట విలన్‌గా ‘ఛోటా ప్యాకెట్’

వాన్ మాడ్సెన్: ఈ జాబితాలో రెండవ ఆటగాడు ఇటలీ కెప్టెన్ వాన్ మాడ్సెన్. అతని వయసు 42 సంవత్సరాలు. క్రికెట్ ఆడటానికి ముందు, అతను దక్షిణాఫ్రికా తరపున అంతర్జాతీయంగా హాకీ కూడా ఆడాడు. మాడ్సెన్ దక్షిణాఫ్రికాలో జన్మించాడు. ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడాడు. అతను 253 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 17,067 పరుగులు చేశాడు. అయితే అతను ఏడు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 205 పరుగులు చేశాడు.

మహ్మద్ నబీ: ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్-బౌలింగ్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ దేశీయ క్రికెట్‌లో తన కొడుకుతో కలిసి ఆడుతూ.. వార్తల్లో నిలుస్తున్నాడు. 41 ఏళ్ల నబీ ప్రపంచ కప్‌లో ఆడనున్న అతి పెద్ద వయసు ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. నబీ ఇప్పటివరకు 148 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 2,430 పరుగులు చేశాడు. తన బౌలింగ్‌తో 104 వికెట్లు పడగొట్టాడు.

రోలోఫ్ వాన్ డెర్ మెర్వే: నెదర్లాండ్స్‌కు చెందిన రోలోఫ్ వాన్ డెర్ మెర్వే నాలుగో స్థానంలో నిలిచాడు. 41 ఏళ్ల అతను 67 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 561 పరుగులు చేసి 74 వికెట్లు పడగొట్టాడు. భారత పిచ్‌లపై తన బౌలింగ్‌తో మెర్వే తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

ఇది కూడా చదవండి: PCB vs ICC: ఐసీసీకి పోటీగా మరో క్రికెట్ బోర్డ్ ఏర్పాటు.. ఆ రెండు దేశాల మద్దతుతో పాక్ దూకుడు..?

బ్రాండన్ టేలర్: ఈ జాబితాలో జింబాబ్వేకు చెందిన బ్రెండన్ టేలర్ అగ్రస్థానంలో ఉన్నాడు. టేలర్ 2004 నుంmr జింబాబ్వే తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. గత రెండు దశాబ్దాలుగా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఫిబ్రవరి 6న టేలర్ 40 ఏళ్లు పూర్తి చేసుకుంటాడు. ఇప్పటివరకు 58 zw20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అతను 1,185 పరుగులు చేశాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *